Begin typing your search above and press return to search.

సంక్రాంతికి సుందర్ దెయ్యాలు

వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడం కోసం ఇప్పటి నుంచి స్లాట్ బుక్ చేసేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   30 Sep 2023 4:01 AM GMT
సంక్రాంతికి సుందర్ దెయ్యాలు
X

వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడం కోసం ఇప్పటి నుంచి స్లాట్ బుక్ చేసేసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో పోటీకి సిద్ధంగా ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సంక్రాంతికి రావడం ఖాయంగా అయిపొయింది. అలాగే ప్రశాంత్ వర్మ సూపర్ హీరో మూవీ హనుమాన్ కూడా రిలీజ్ కానుంది. రవితేజ ఈగల్ తో రాబోతున్నాడు. అలాగే నాగార్జున నా సామి రంగా అంటూ రెడీ అవుతున్నారు.

ఇలా స్ట్రైట్ తెలుగు సినిమాలే నాలుగు సంక్రాంతికి రాబోతున్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా వీటికి పోటీగా సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతోన్న ఫిక్షనల్ స్టొరీ అయలన్ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులో కూడా ప్రేక్షకులని పలకరించనుంది. ఇప్పుడు సుందర్ సి నుంచి వచ్చే అరణ్మణి సిరీస్ లో 4వ మూవీ తెరకెక్కుతోంది.

ఇందులో రాశీఖన్నా, తమన్నా బాటియా కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ అరణ్మణి సిరీస్ లో వచ్చే హర్రర్ చిత్రాలు తెలుగులో ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న తమిళనాట హిట్ అవుతున్నాయి. అందుకే సుందర్ సి ఈ సిరీస్ ని కొనసాగిస్తున్నారు. ఇందులో నాలుగో చిత్రంలో రాశీఖన్నా, తమన్నా ఇద్దరూ దెయ్యాలుగా నటిస్తున్నారంట.వారితో ప్రేక్షకులని భయపెట్టడానికి సిద్ధమైన సుందర్ సి ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

తమిళంలో సంక్రాంతి రేసులో ఒక్క అయలన్ మూవీ తప్ప పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. అందుకే తన అరణ్మణి 4ని ఆ టైంలో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారంట. కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

తెలుగులో పెద్ద సినిమాల మధ్య ప్రేక్షకులకి రీచ్ కాకున్నా తమిళంలో మాత్రం కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని నమ్ముతున్నారంట. అందుకే సంక్రాంతికి తన చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలోనే సుందర్ సి ఉన్నట్లు కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోన్న మాట.