Begin typing your search above and press return to search.

రెహమాన్‌ రూటే సపరేటు..!

ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   22 April 2025 2:30 PM
రెహమాన్‌ రూటే సపరేటు..!
X

ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఒకప్పుడు రెహమాన్‌తో వర్క్‌ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని సౌత్‌ ఫిల్మ్‌ మేకర్స్ భావించేవారు. కానీ ఇప్పుడు సౌత్‌లో లెక్కకు మించిన సినిమాలను రెహమాన్ కమిట్ అవుతున్నాడు. ఒక వైపు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూనే మరో వైపు టాలీవుడ్‌, కోలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తున్న రెహమాన్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జీవన శైలి గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దాదాపు పాతిక సంవత్సరాలుగా తాను ఒకే జీవన శైలిని ఫాలో అవుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు. ప్రతి రోజు కొత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంకా ఏఆర్‌ రెహమాన్‌ మాట్లాడుతూ... సహజంగా అంతా పగలు ప్రయాణాలు చేస్తారు, కానీ నేను మాత్రం రాత్రి సమయంలోనే ప్రయాణాలకు ఎక్కువ ఇష్టపడుతాను. నేను దర్గాకు కూడా రాత్రి సమయంలోనే వెళ్లి ప్రశాంతంగా కొంత సమయం అక్కడ ఉండి వస్తాను. తాల్‌ సినిమా చేస్తున్న సమయంలో నాకు ఈ జీవన శైలి అలవాటు అయింది. అప్పటి నుంచి కూడా రాత్రి సమయంలోనే వర్క్ చేయడం మొదలు పెట్టాను. తాల్‌ సినిమా కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 రాత్రులు కష్టపడ్డాను. ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది. మంచి పాటలను ఇవ్వడం ద్వారా సంతృప్తి కలిగింది. అప్పటి నుంచి రాత్రి సమయంలోనే వర్క్ చేయడం అలవాటుగా మారింది.

మధ్య రాత్రి రెండు గంటల సమయంలో నిద్రలోంచి లేచి పని చేసుకుని తిరిగి ఉదయం 7 గంటలకు పడుకున్న సందర్భాలు చాలానే ఉంటాయి. ఇక ముఖ్యమైన సినిమాలకు, ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉన్న సినిమాలకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రికార్డింగ్‌ చేస్తూ ఉంటాం. ఎక్కువగా తాను రాత్రి సమయంలో వర్క్ చేయడానికి కారణం ఆ సమయంలో మాత్రమే ప్రశాంతత ఉంటుంది. ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా రాత్రి సమయంలో వర్క్ చేయడం ద్వారా ఔట్ పుట్‌ బాగా వస్తుందని నమ్ముతాను. అందుకే చాలా కాలం నుంచి ఈ పద్దతిని పాటిస్తున్నట్లుగా రెహమాన్‌ చెప్పుకొచ్చాడు. ఏ సమయంలో చేస్తే ఏం రెహమాన్‌ అద్భుతమైన సంగీతాన్ని ఇస్తాడనే అభిప్రాయం అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రెహమాన్‌ తెలుగు సినిమా 'పెద్ది'కి సంగీతాన్ని ఇస్తున్నాడు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ హీరోగా, బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండే విధంగా రెహమాన్‌ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఆ విషయం గ్లిమ్స్ వీడియోతోనే రెహమాన్‌ క్లారిటీ ఇచ్చాడు. కాస్త లేట్ అయినా గ్లిమ్స్‌కి రెహమాన్ ఇచ్చిన నేపథ్య సంగీతం హైలైట్‌గా నిలిచిందని అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. ముందు ముందు పెద్ది నుంచి వచ్చే పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా అభిమానులు చెబుతున్నారు. తమిళ్‌లో ధనుష్‌ నటించబోతున్న సినిమాకు రెహమాన్‌ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇవి కాకుండా మరో రెండు మూడు సినిమాలు సైతం సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో రెహమాన్‌ ఈ ఏడాదిలో చేయబోతున్నాడు.