రజనీ- ప్రభాస్ కంటే ధనికుడైన సంగీత దర్శకుడు
సూపర్ స్టార్ రజనీకాంత్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. వీళ్లందరి కంటే ధనికుడైన సంగీత దర్శకుడు ఒకరు భారతదేశంలో ఉన్నారు.
By: Tupaki Desk | 29 April 2025 3:43 AMసూపర్ స్టార్ రజనీకాంత్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. వీళ్లందరి కంటే ధనికుడైన సంగీత దర్శకుడు ఒకరు భారతదేశంలో ఉన్నారు. ఆయన ఎవరో తెలుసుకోవాలని ఉందా? నిస్సందేహంగా లెజెండరీ సంగీత దర్శకుడు, మొజార్ట్ ఆఫ్ మద్రాస్ ఏ.ఆర్.రెహమాన్. తనకు వందల కోట్ల ఆస్తి ఉన్నా నిశ్శబ్దంగా ఉండే ప్రముఖుడు ఆయన. విలాసవంతంగా జీవిస్తాడు.. కానీ అంతగా సౌండ్ చేయదు. చెన్నైలోని విశాలమైన బంగ్లా నుండి లాస్ ఏంజిల్స్‌లోని అరుదైన అపార్ట్‌మెంట్ స్టూడియో వరకూ.. AR రెహమాన్ జీవనశైలి అల్ట్రా రిచ్ అని చెప్పాలి. అతడి గ్యారేజీలో కార్ల విలువ సుమారు 8కోట్లు.
AR రెహమాన్ చెన్నై ఇంటి ఖరీదు సుమారు రూ. 20 కోట్లు. లాస్ ఏంజెల్స్ లో అతడికి 25 కోట్ల ఖరీదు చేసే ఇల్లు ఉంది. ఒక పాటకు సంగీతం అందించేందుకు 3 కోట్లు సుమారుగా వసూలు చేసే అతడు కెరీర్ లో 150 పైగా సినిమాలకు పని చేసారు. అతడి మొత్తం నికర ఆస్తుల విలువ రూ. 1728 కోట్లుగా ఉందని ఒక అంచనా.
అతడు AR రెహమాన్ కావడానికి ముందు దిలీప్ అనే ఒక యువకుడిగా తన కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి పోరాటం ప్రారంభించాడు. అతడు తన స్కూలింగ్ ను కూడా త్యాగం చేసాడు. కానీ 1992లో వచ్చిన రోజా చిత్రం ఒక మేలి మలుపు. ప్రారంభ చిత్రంతోనే అతడు జాతీయ అవార్డ్ అందుకున్నాడు. 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ కోసం ఒకటి కాదు రెండు అకాడమీ అవార్డులను గెలుచుకున్నాడు. ఒకప్పుడు సంగీత పరికరాలను అరువుగా తీసుకున్న బాలుడు ఇప్పుడు ఖండాతరాలలో స్టూడియోలను సొంతం చేసుకున్నాడు.
చెన్నైలోని కోడంబాక్కం తమిళనాడులోని బెవర్లీ హిల్స్‌గా పాపులరైంది. ఇక్కడ తన సొంత రాజభవనం ప్రతి విషయంలోనూ మాస్ట్రోకు స్వర్గధామం. 2005 లో కొనుగోలు చేసిన ఈ బంగ్లా ధర సుమారు పాతిక కోట్లు. రెహమాన్ మొదటి స్టూడియో- పంచతన్ రికార్డ్ ఇన్. 1992లో ఇది ప్రారంభమైంది. అది అతడి ప్రయోగశాల.. ఆలయం. తరువాత ఏఎం స్టూడియోస్ స్థాపించాడు. ఇది భారతీయ, అంతర్జాతీయ కళాకారులకు గమ్యస్థానంగా మారిన అత్యాధునిక ఆడియో ప్రొడక్షన్ సూట్. కానీ రెహమాన్ ప్రభ భారత గడ్డపైనే ఆగలేదు. అతడు ఎక్స్‌పో 2020 మద్దతుతో దుబాయ్‌లో ఫిర్దౌస్ స్టూడియోకు సహస్థాపకుడిగా మారాడు. లండన్‌లో ఎలైట్ కేఎం మ్యూజిక్ స్టూడియో అతడి సొంతమైంది. 2010లో రెహమాన్ సైలెంట్ గా లాస్ ఏంజిల్స్‌లో ఒక విలాసవంతమైన ఆస్తిని సంపాదించాడు. దీని ఖరీదు 25 కోట్లు. ఇది కేవలం ఇల్లుగా మాత్రమే కాకుండా ప్లగ్-అండ్ స్టూడియోగాను ఉపయోగపడుతోంది.
ఇక గ్యారేజీలోని కార్లలో ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ ఎస్ - క్లాస్ ధర సుమారు. రూ. 3 కోట్లు, జాగువార్ XF ధర రూ. 1.2 కోట్లు, వోల్వ్ XC90 - ధర దాదాపు రూ. 1 కోటి, ఫోర్చే టేకన్ ఈవీ వెళ- రూ. 3 కోట్లు. సుమారు 8 కోట్ల విలువ చేసే కార్లు అతడి గ్యారేజీలో ఉన్నాయి.