మ్యూజిక్ లెజెండ్ కి ఊరట!
కాపీరైట్ ఉల్లంఘన వ్యాజ్యంలో సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ కు ఢిల్లీ హైకోర్టు స్టే విధించి ఊరట కల్పించింది.
By: Tupaki Desk | 7 May 2025 2:36 PM ISTకాపీరైట్ ఉల్లంఘన వ్యాజ్యంలో సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ కు ఢిల్లీ హైకోర్టు స్టే విధించి ఊరట కల్పించింది. మ్యూజిక్ రైట్స్ విషయంలో ఏ.ఆర్ రెహమాన్ ఆరోపణలు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. `పొన్నియిన్ సెల్వన్ 2` చిత్రంలోని ఓ పాటకు సంబంధించిన కాపీరైట్ కేసులో ఏ. ఆర్. రెహమాన్ పై ఆరోపణలొచ్చాయి. దీనికి సంబంధించి రెహమాన్ - చిత్ర నిర్మాణ సంస్థపై రూ. 2 కోట్లు జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిని సవాల్ చేస్తూ రెహమాన్ దాఖలు చేసిన పిటీషన్ ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణకు స్వీకరించి సింగిల్ జడ్జి తీర్పుకుకు మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసారు. `పొన్నియన్ సెల్వన్ 2`లోని ‘వీరా రాజ వీర’ పాటకు సంబంధించి రెహమాన్ కాపీరైట్ కేసు ఎదుర్కొంటున్నారు. పద్మ శ్రీ గ్రహీత, భారత శాస్త్రీయ గాయకుడు ఫయాజ్ వాసిపుద్దీన్ ఠాకూర్ 2023 లో ఢిల్లీ హైకోర్టులో రెహమాన్ పై కాపీరైట్ పిటీషన్ దాఖలు చేసారు.
`వీర రాజ వీర` పాట తన తండ్రి నజీర్ ఫయాజుద్దీన్ ఠాకూర్, మామ జహీరుద్దీన్ ఠాకూర్ స్వరపరిచిన శివ స్తుతి పాట నుంచి కాపీ చేసారని పిటీషన్ లో పేర్కొన్నారు. ఆ పాటను ఎక్కడా ఉపయోగించకుండా రెహ మాన్ , మద్రాస్ టాకీస్ లను ఆదేశించాలని, కాపీరైట్ చట్టం కింద పరిహారం చెల్లించాలని ఫయాజ్ వాసి పుద్దీన్ కోర్టును అభ్యర్ధించారు.
దీంతో రెహమాన్ కూడా కౌంటర్ దాఖలు చేసారు. పిటీషన్ పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ కు 2 కోట్లు, పిటీషనర్ కు 2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. తాజాగా ఆ చెల్లింపులకు సంబంధించి స్టే విధించినట్లు తెలుస్తోంది. తదుపరి విచారణ ఈనెల 23కి వాయిదా పడింది.
