వాటికి చెక్ పెట్టాలనే అలా చేస్తున్నారా?
సంగీత శిఖరం ఏ.ఆర్ .రెహమాన్ భారతీయ చలన చిత్ర రంగానికి అందించిన సేవల గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 2 Dec 2025 11:00 PM ISTసంగీత శిఖరం ఏ.ఆర్ .రెహమాన్ భారతీయ చలన చిత్ర రంగానికి అందించిన సేవల గురించి చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయంగా భారతీయ సంగీతానికి ఓ గుర్తింపు దక్కిందంటే కారణం రెహమాన్. ఆయన ప్రతిభతోనే దేశానికి ఆ ఖ్యాతి సాధ్యమైంది. మ్యూజిక్ లో అతడి టెక్నిక్స్..టెక్నికల్ గా అప్ డేట్ అవ్వడం వంటివి అతడికే చెల్లింది. మూడు దశాబ్దాలుగా సంగీత ప్రియుల్ని తన స్వరాలతో మంత్ర ముగ్దుల్ని చేస్తున్నారు. తమిళ, హిందీ, తెలుగులో ఎన్నో సినిమాలకు సంగీతం అందించి తనదైన ముద్ర వేసారు. అంతటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ పై ట్యూన్స్ విషయంలో ఎన్నో ఆరోపణలున్నాయి.
రెహమాన్ పై ఆరోపణలు:
ఓ సందర్భంలో రామ్ గోపాల్ వర్మ సైతం రెహమాన్ పై అసంతృస్తిని వ్యక్తంచేసిన దర్శకుడే. ట్యాన్స్ ఇవ్వడంలో అలసత్వం ప్రదర్శిస్తారని...చెప్పిన టైమ్ కి ట్యూన్ ఇవ్వడని... తన పేరుని మాత్రమే బ్రాండ్ గా వాడుకుని ఇతరులతో ట్యూన్లు కంపోజ్ చేయిస్తారని, తాను ఇచ్చిన ట్యూనే తీసుకోవాలని..ఎదురు మాట్లాడటానికి వీలుండదని ఇలా కొన్ని రెహమాన్ పై చాలా కాలంగా కొన్ని ఆరోపణలున్నాయి. వీటిలో కొన్నింటిని రెహమాన్ స్వాగతించడం కూడా జరిగిందని ఆయనతో పనిచేసిన వారే చెప్పారు. ఇలా పని చేయడం వల్ల రెహమాన్ ప్రోపెషనల్ కెరీర్ పై ప్రభావం పడిందా? అంటే అందుకు ఛాన్స్ లేకపోలేదన్నది అంతే వాస్తవం.
`పెద్ది`తో ఆయనలో మార్పు:
అలసత్వం కారణంగా రెహమాన్ తో పని చేయాలి అనుకున్న కొంత మంది దర్శకులు వెనక్కి తగ్గారు. ఆయనతో పెట్టుకుంటే పాటల చిత్రీకరణ అనుకున్న టైమ్ లో పూర్తి చేయలేము? అన్న భయంతో పని చేయాలనే ఆసక్తి ఉన్నా చేయ లేకపోయారు. అయితే తాజాగా రెహమాన్ సంగీతం అందిస్తోన్న `పెద్ది` సినిమాతో అలాంటి వాటికి చెక్ పెట్టే దిశగా రెహమాన్ పని చేసినట్లు కనిపిస్తోంది. `పెద్ది` కోసం దర్శకుడు బుచ్చిబాబుతో ఇంటరాక్ట్ అయిన విధానం.. రెహమాన్ ముందు బుచ్చిబాబు సీన్ చెప్పడం..అప్పటికప్పడు స్వరమాంత్రికుడు ట్యూన్ కట్టడం వంటివి షాకింగ్ గానే అనిపించాయి.
ఈసారి డైరెక్టర్లు ముందుకొస్తారా?
ఆ మొత్తం సన్నివేశాన్ని వీడియో షూట్ చేసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన విధానం తెలిసిందే.ఇంత వరకూ రెహమాన్ ఇలా ఓ డైరెక్టర్ తో ఇంటరాక్ట్ అయింది వీడియో రూపంలో ఎక్కడా బయటకు రాలేదు. దీంతో రెహమాన్ లో వచ్చిన మార్పుగా కొందరు భావిస్తున్నారు. తనపై వచ్చిన నెగివిటీని తొలగించు కోవడం కోసమే వీడియో రూపంలో బయటకు వదిలినట్లు పరిశ్రమలో చర్చ జరు గుతోంది. ఇదే నిజమైతే? దర్శకులకు ఊరటనిచ్చే విషయమే. రెహమాన్ తో పని చేయాలని ఎంతో మంది దర్శకులు వెయిట్ చేస్తున్నారు. వారంతా స్వేచ్ఛగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది.
