Begin typing your search above and press return to search.

రెహ‌మాన్ బ్రాండ్ ఇమేజ్ ని అలా వాడుతున్నాడు!

ఆ పేరుతో మార్కెట్ లోకి వెళ్తే క‌లిసొస్తుంద‌నే న‌మ్మ‌కంతో స‌ద‌రు నిర్మాత‌లు డైరెక్ట‌ర్ల‌తో ఒప్పందం చేసు కుంటారు.

By:  Tupaki Desk   |   23 July 2025 1:07 PM IST
రెహ‌మాన్ బ్రాండ్ ఇమేజ్ ని అలా వాడుతున్నాడు!
X

స‌క్సెస్ అనంత‌రం వ‌చ్చే బ్రాండ్ ఇమేజ్ ని ఒక్కొక్క‌రు ఒక్కోలా వాడుతుంటారు. హీరోలు...హీరోయిన్లు అయితే త‌మ బ్రాండ్ తో ప్రొడ‌క్ట్ ల‌ను మార్కెట్ లోకి తీసుకెళ్తుంటారు. అందుకు గాను భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటారు. నిమిషాల యాడ్ కోసమే కంపెనీలు కోట్లు చెల్లిస్తుంటాయి. నిర్మాత‌లు త‌ప్ప ఈ కేట‌గిరీకి న‌టీన‌టులంతా వ‌స్తుంటారు. అరుదుగా ద‌ర్శ‌కులు కూడా క‌నిపిస్తుంటారు. ఇక ఇండ‌స్ట్రీలో లోపల డైరెక్ట‌ర్లు బ్రాండ్ ఇమేజ్ ని మ‌రోలా వాడుతుంటారు. ఇత‌ర బ్యాన‌ర్ల‌లో త‌మ పేరును వేసుకుని సినిమాలు రిలీజ్ చేస్తుంటారు.

ఆ పేరుతో మార్కెట్ లోకి వెళ్తే క‌లిసొస్తుంద‌నే న‌మ్మ‌కంతో స‌ద‌రు నిర్మాత‌లు డైరెక్ట‌ర్ల‌తో ఒప్పందం చేసుకుంటారు. అలా ఆ సినిమాలో స‌క్సెస్ పుల్ డైరెక్ట‌ర్ స్లీపింగ్ పార్ట‌న‌ర్ గా క‌నిపిస్తుంటాడు. ఇదే విధానంలో చాలా మంది హీరోలు కూడా సినిమాలు చేస్తుంటారు. ప్ర‌స్తుతం ట్రెంట్ కూడా ఇదే. అయితే ఈ ట్రెండ్ ను మ్యూజిక్ లెజెండ్ ఏ. ఆర్ . రెహ‌మాన్ వీళ్లంద‌రి కంటే ముందే మొద‌లు పెట్టారు? అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. రెహ‌మాన్ గురించి సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ ఈమ‌ధ్య కాలంలో కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.

ఎవ‌రూ బ‌య‌ట‌కు చెప్ప‌ని రెహ‌మాన్ విష‌యాల‌ను వ‌ర్మ ప‌బ్లిక్ లో పెట్ట‌డం ఇంట్రెస్టింగ్. తాజాగా త‌న పేరునే ఓ బ్రాండ్ గా ఓ నిర్మాత‌కు చెప్పి షాక్ ఇచ్చాడ‌ని వ‌ర్మ అన్నారు. రెహ‌మాన్ స్వ‌యంగా సంగీతం అందించ‌డం కంటే త‌న పేరునే బ్రాండ్ గా ఇస్తాడుట‌. ఆ పాట‌కు సంగీతం మ‌రోక‌రు అందించ‌గా...త‌న పేరుతో మాత్ర‌మే రిలీజ్ అవుతుంద‌న్నారు. `థాల్` సినిమా పాట‌ల విష‌యంలో ఇదే జ‌రిగింద‌న్నారు. ఆ సినిమాలో ఓ పాట‌కు సుకువింద‌ర్ సాంగ్ అందించాడుట‌. ఆ పాట కంపోజ్ చేయ‌మ‌ని రెహ‌మ‌న్ ఆర్డ‌ర్ చేయ‌డంతో అలా చేసారుట‌.

కానీ ఆ విష‌యం తెలిసి చిత్ర‌నిర్మాత సుభాష్ ఘాయ్ రెహ‌మాన్ పై సీరియ‌స్ అయ్యారుట‌. అప్పుడు రెహ‌మాన్ ఎందుకంత సీరియ‌స్ అవుతావ్? ష‌ర్ట్ అప్ యువ‌ర్ మౌత్ అన్నారుట‌. మీకు నిజం చెప్పాను కాబ‌ట్టే తెలిసింది. ఒక‌వేళ ఇదే నిజం నేను చెప్ప‌క‌పోతే ఎప్ప‌టికీ తెలిసేది కాదు. క‌దా? అప్పుడు నేను ప్లాప్ మ్యూజిక్ ఇచ్చినా తీసుకునే వారు క‌దా? అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారంటూ రెహ‌మాన్ నిర్మాత‌తో అన్నారుట‌. అప్పుడు రెహ‌మాన్ చెప్పిన లాజిక్ కూడా క‌రెక్టే క‌దా? అన్న ఆలోచ‌న‌తో నిర్మాత‌ ఆవేశం త‌గ్గించుకున్న‌ట్లు వ‌ర్మ తెలిపారు.