Begin typing your search above and press return to search.

ఈ వర్మ హీరోయిన్‌ ను గుర్తు పట్టగలరా...?

ఇంతకు ఈమె ఎవరు అంటే.. అప్సర రాణి. ఔను అండి రామ్ గోపాల్‌ వర్మ ఆరాధించే అందమైన అప్సర రాణి. ఈమె అందాన్ని వర్మ ఎంతగా పొగడ్తలతో ముంచెత్తాడో అందరికి తెల్సిందే.

By:  Tupaki Desk   |   25 Nov 2023 2:36 PM GMT
ఈ వర్మ హీరోయిన్‌ ను గుర్తు పట్టగలరా...?
X

ఈ ఫోటోలో కనిపిస్తున్న నటి ఎవరో గుర్తు పట్టారా... ఎవరో కొత్త అమ్మాయిలా ఉంది. మాకు ఎలా తెలుస్తుంది అంటారా.. ఈమె కొత్త అమ్మాయి కాదు. చాలా కాలంగా సినిమాల ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులను, కుర్రకారును ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ఈమె పేరు చెప్తే ఈజీగా గుర్తు పట్టేస్తారు.


ఈమె సినిమా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే రామ్‌ గోపాల్‌ వర్మ ఈమె అందం గురించి ట్వీట్‌ చేశాడో, ఆమె ను తన సినిమాలో నటింపజేశాడో అప్పటి నుంచి సోషల్‌ మీడియా సెన్షేషన్ గా మారింది అనడంలో సందేహం లేదు.


ఇప్పటికి కూడా ఈమె ఎవరో గుర్తు వచ్చి ఉండదు. ఎందుకంటే అంతగా ఈమె మేకప్ తో గుర్తు పట్టనంతగా మారింది. ఇంతకు ఈమె ఎవరు అంటే.. అప్సర రాణి. ఔను అండి రామ్ గోపాల్‌ వర్మ ఆరాధించే అందమైన అప్సర రాణి. ఈమె అందాన్ని వర్మ ఎంతగా పొగడ్తలతో ముంచెత్తాడో అందరికి తెల్సిందే.


ఇన్నాళ్లు తన అందంతో నెటిజన్స్ కన్నుల విందు చేసిన అప్సర రాణి ఇప్పుడు ఈ షాకింగ్ లుక్ తో సర్‌ ప్రైజ్ చేసింది. ఒక సినిమా కోసం ఈ సర్‌ప్రైజ్ లుక్‌ ని ట్రై చేసినట్లుగా అప్సర రాణి ఇన్‌ స్టా ద్వారా ఈ ఫోటోలను షేర్‌ చేసింది. ఈ లుక్ లో చాలా వైవిధ్యభరితంగా ఉన్నావు... కానీ నిన్ను ఇలా చూడలేక పోతున్నాం అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.