Begin typing your search above and press return to search.

ఏప్రిల్ చిత్రాల సంగతేంటి?

అయితే ఏప్రిల్ లో కూడా అనేక సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దాదాపు 20కి పైగా చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

By:  Tupaki Desk   |   1 April 2025 3:21 PM IST
ఏప్రిల్ చిత్రాల సంగతేంటి?
X

2025లో అప్పుడే మూడు నెలలు కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కొన్ని హిట్ అయ్యాయి.. మరికొన్ని ఫట్ అయ్యాయి.. రీసెంట్ గా మార్చి లాస్ట్ వీక్ లో రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, సికిందర్, ఎంపురాన్, వీర ధీర శూర వంటి చిత్రాలు రిలీజ్ అయ్యాయి.

అయితే ఏప్రిల్ లో కూడా అనేక సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దాదాపు 20కి పైగా చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. టాలీవుడ్ ప్రముఖ ఫ్యామిలీ మంచు కాంపౌండ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప వాయిదా పడగా.. మిగతా చిత్రాలు అనుకున్న డేట్ కే రానున్నాయి.

ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ జాక్, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలే మెయిన్ గా కనిపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. జాక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా.. గుడ్ బ్యాటీ అగ్లీ కమర్షియల్ యాక్షన్ మూవీగా రూపొదిద్దుకుంటోంది.

అయితే ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో అనుకున్నంత బజ్ క్రియేట్ అవ్వలేదని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. రెండూ కూడా ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే మేకర్స్ ఆ విషయాన్ని అనౌన్స్ చేశారు. కానీ తమ

సినిమాలు కచ్చితంగా చూడాలనేంతగా మాత్రం ప్రమోట్ చేయాలని నెటిజన్లు చెబుతున్నారు.

ఆ రెండు సినిమాలతోపాటు బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ లీడ్ రోల్ లో టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన జాట్ మూవీ కూడా ఏప్రిల్ 10నే రానుంది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా నటిస్తున్న ఓదెల 2.. 17వ తేదీ రిలీజ్ కానుంది. సీక్వెల్ కనుక మూవీపై ఆడియన్స్ లో మోస్తరు అంచనాలు ఉన్నాయి.

ఆ తర్వాత రోజు కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి.. సారంగపాణి జాతకం విడుదల్వనుంది. వీటితోపాటు అనేక చిన్న చిత్రాలు రిలీజ్ కానున్నాయి. నిజానికి సమ్మర్ లో ఎప్పుడూ పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈసారి ఆ సందడి పెద్దగా లేదు. రిలీజ్ అవ్వనున్న చిత్రాలపై బజ్ లేదు. కాబట్టి ఇప్పుడు విడుదలవ్వనున్న సినిమాల రిజల్ట్ మౌత్ టాక్ పై ఆధారపడి ఉంటుందనే చెప్పాలి. మరి చూడాలి ఏం జరుగుతుందో..