టాప్ హీరోయిన్‌తో బ్రేకప్.. పుకార్లే అని కొట్టి పారేసిన భర్త
ఆపిల్ బ్యూటీగా పాపులరైన ప్రముఖ కథానాయిక భర్త నుంచి విడిపోతోందంటూ కొన్ని నెలలుగా పుకార్లు షికార్ చేస్తున్నాయి.
By: Tupaki Desk | 19 July 2025 8:14 PM ISTఆపిల్ బ్యూటీగా పాపులరైన ప్రముఖ కథానాయిక భర్త నుంచి విడిపోతోందంటూ కొన్ని నెలలుగా పుకార్లు షికార్ చేస్తున్నాయి. 2022లో తన బిజినెస్ పార్టనర్ ని పెళ్లాడిన సదరు హీరోయన్, 2023 నుంచి అతడితో సరిగా లేదు! అనే గుసగుసలు సోషల్ మీడియాల్లో వైరల్ గా మారాయి. ఇన్ స్టాలో జోరుగా ఫోటోషూట్లు, కుటుంబ విషయాలను షేర్ చేయడానికి వెనకాడని సదరు కథానాయిక 2023 నుంచి భర్తతో కలిసి అన్యోన్యంగా ఉన్న లేదా సెలబ్రేషన్ లో ఫోటోలను షేర్ చేయకపోవడంతో రెడ్డిటర్లు అనుమానించారు. మొదటి వివాహ వార్షికోత్సవం తర్వాత అసలు ఈ జంట నడుమ సందడి లేదు. దీంతో వారి మధ్య ఏదో జరుగుతోందని ఊహాగానాలు మొదలయ్యాయి.
మొదట పెళ్లి తర్వాత కాపురానికి అత్తగారింటికి వెళ్లిన సదరు హీరోయిన్ పెద్ద కుటుంబంలో ఇమడలేకపోయిందని పుకార్లు వచ్చాయి. దీంతో అదే పెద్ద భవంతిలో ఒక కార్నర్ ప్లేస్ కి భార్యాభర్తలు షిఫ్టయ్యారు. అయినా భర్తతో మనస్ఫర్థల కారణంగా ఇప్పుడు తన తల్లి వద్దకు సదరు హీరోయిన్ వచ్చేసింది. భర్త తన తల్లిదండ్రులు, కుటుంబీకులతో కలిసి నివశిస్తున్నారని పుకార్లు వచ్చాయి.
అయితే ఈ పుకార్లపై ఆ ఇద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. కానీ ఇప్పుడు సదరు హీరోయిన్ భర్త స్పందించారు. ఇవేవీ నిజాలు కాదు అని అన్నారు. అయినా భార్య నుంచి విడివిడిగా ఉంటున్న విషయంపై అతడు స్పందించలేదు. జంటల మధ్య భేధాభిప్రాయాలు, మనస్ఫర్థలు చాలా సహజం. కానీ సరిదిద్దుకోలేనన్ని తప్పులు జరగకుండా జాగ్రత్త పడటం, సరి దిద్దే ఇంటి పెద్ద లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారింది. చిన్న విషయానికే భార్యాభర్తలు విడిపోవడం వరకూ వెళ్లడం ఆశ్చర్యపరుస్తుంది. కానీ ఇప్పుడు ఈ సెలబ్రిటీ జంట నడుమ అంతా సర్ధుకుంటుందని భావిస్తున్నారు.
