Begin typing your search above and press return to search.

నన్నెమైనా అల్లు అర్జున్ అనుకుంటున్నాడా?

అయితే ఈ పాటకు సంబంధించిన ఒక స్పెషల్ ప్రమోషన్ వీడియోను కూడా విడుదల చేశారు. అందులో తరుణ్ కొంతమంది చిన్న పిల్లలతో మాట్లాడుతూ తనపై తానే సెటైర్స్ వేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   2 Nov 2023 4:01 PM GMT
నన్నెమైనా అల్లు అర్జున్ అనుకుంటున్నాడా?
X

షార్ట్ ఫిలిమ్స్ తీసి ఆ తర్వాత వెండితెరపై దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు నటుడిగా కూడా చాలా బిజీగా మారిపోతున్నాడు. అంతేకాకుండా యాంకర్ గా హోస్ట్ గా కూడా కనిపించిన ఈ యువ దర్శకుడు ఇప్పుడు సినిమాలలో స్టెప్పులు కూడా వేస్తున్నాడు. తరుణ్ భాస్కర్ దాదాపు ఆల్ రౌండర్ అనేలా ముందుకు కొనసాగుతున్నాడు.

మొదటి సినిమా పెళ్లిచూపులు సినిమా తోనే బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ అందుకుని మంచి అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాతోనే విజయ్ దేవరకొండ ఒక డిఫరెంట్ హీరోగా పరిచయమై ఇండస్ట్రీలో మరో స్థాయికి చేరుకున్నాడు. అనంతరం ఈ నగరానికి ఏమైంది అనే సినిమాను అందించిన తరుణ్ భాస్కర్ యూత్ లో అయితే మంచి గుర్తింపు అందుకున్నారు.

ఆ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు తీస్తారా అని ఫ్యాన్స్ అయితే ఎంతో బ్రతిమాలుతున్నారు. ఇక మొత్తానికి ఇప్పుడు కీడా కోలా అనే సినిమాతో థియేటర్లలో దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా సక్సెస్ అందుకోవడానికి రెడీ అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ మంగళవారం అనే సినిమాలో ఒక స్పెషల్ కామియో తో కూడా అలరించబోతున్నాడు. దర్శకుడు అజయ్ భూపతి అతనితో ఏకంగా డాన్స్ చేయిస్తూ ఉండడం విశేషం.

అప్పడప్పడ తాండ్ర.. అనే ఈ పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ పాటకు సంబంధించిన ఒక స్పెషల్ ప్రమోషన్ వీడియోను కూడా విడుదల చేశారు. అందులో తరుణ్ కొంతమంది చిన్న పిల్లలతో మాట్లాడుతూ తనపై తానే సెటైర్స్ వేసుకున్నాడు. తనది లోకల్ కాదు అని హైదరాబాద్ అంటూ ENE 2 తీయాలని ఫాన్స్ అందరు కూడా డిమాండ్ చేస్తున్నారు అని త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అని చెప్పాడు.

అలాగే ఈ సినిమాలో ఒక డాన్స్ చేయడానికి వచ్చాను అని రాకపోయినా కూడా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అని, వీళ్ళు గట్టిగానే కష్టపెడుతున్నారు అన్నట్లు వివరణ ఇచ్చాడు. అంతే కాకుండా డైరెక్షన్ తప్ప ఈ పిచ్చోడు అన్ని చేస్తూ ఉంటాడు అని తనపై సెటైర్ వేసుకున్నాడు తరుణ్. అలాగే ఆ వీడియోలో షూటింగ్ సెట్స్ లో కొందరు పిలుస్తూ ఉండడంతో 'నన్ను ఏమైనా అల్లు అర్జున్ అనుకుంటున్నాడా?' అంటూ మరో పంచ్ వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.