Begin typing your search above and press return to search.

యాపారం మొదలు పెట్టిన మరో హీరోయిన్‌

తమకు ఉన్న స్టార్‌ డమ్‌ మరియు గుర్తింపు కారణంగా పెట్టిన వ్యాపారంకు ఫ్రీగా పబ్లిసిటీ దక్కతుంది.

By:  Tupaki Desk   |   16 Dec 2023 9:53 AM GMT
యాపారం మొదలు పెట్టిన మరో హీరోయిన్‌
X

ఒకప్పుడు నటీ నటులు కేవలం నటనకి మాత్రమే పరిమితం అయ్యేవారు. అందుకే పాత తరం నటీ నటుల్లో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటం మనం ఇప్పటికి చూస్తూనే ఉన్నాం. కాస్త డబ్బు, ఫేమ్‌ ఉన్న సమయంలో వ్యాపారంలో అడుగు పెట్టడం ద్వారా లాభాలు పొందవచ్చు అని ఈతరం నటీ నటులు భావిస్తున్నారు.


తమకు ఉన్న స్టార్‌ డమ్‌ మరియు గుర్తింపు కారణంగా పెట్టిన వ్యాపారంకు ఫ్రీగా పబ్లిసిటీ దక్కతుంది. దాంతో వ్యాపారం మంచి లాభాలు దక్కించుకునే అవకాశం ఉంటుందని చాలా మంది నటీ నటులు ఏదో ఒక వ్యాపారంలో అడుగు పెడుతున్నారు. కేవలం నటన పై దృష్టి పెట్టకుండా అన్ని మార్గాల్లో కూడా డబ్బు సంపాదన కోసం ప్రయత్నిస్తున్నారు.

హీరోలు మరియు హీరోయిన్స్ తమకు ఉన్న బ్రాండ్‌ ఇమేజ్ ని ఉపయోగించుకుని కొత్త బ్రాండ్స్ ను సృష్టిస్తున్నారు. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార తో పాటు ఎంతో మంది హీరోయిన్స్ కూడా వ్యాపారంలో అడుగు పెట్టి మంచి లాభాలు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అపర్ణ బాల మురళి కూడా వ్యాపారం వైపు అడుగులు వేస్తోందట.

సూర్య నటించిన ఆకాశమే నీ హద్దు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలిగా మారిన ముద్దుగుమ్మ అపర్ణ బాలమురళి. ఈమె హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తోంది. ఇదే సమయంలో ఈమె స్నేహితులతో కలిసి వస్త్ర వ్యాపారంలో అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతోందని తెలుస్తోంది.

ఇతర హీరోయిన్స్ మాదిరిగా తాను కూడా వ్యాపారంలో సక్సెస్ అవుతాను అనే నమ్మకంతో ఈమె ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముందు ముందు హీరోయిన్‌ గా బిజీగా ఉంటూనే వ్యాపారంలో కూడా సక్సెస్ ను సొంతం చేసుకోవాలని అపర్ణ ఆశిస్తున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.