Begin typing your search above and press return to search.

శంకర్ పాత సినిమా.. మళ్ళీ షాక్ ఇవ్వదుగా..?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అపరిచితుడు.

By:  Tupaki Desk   |   9 May 2024 3:47 AM GMT
శంకర్ పాత సినిమా.. మళ్ళీ షాక్ ఇవ్వదుగా..?
X

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అపరిచితుడు. తమిళంలో ఆన్నియన్ టైటిల్ తో అప్పట్లో భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమాని శంకర్ తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. తెలుగులో అపరిచితుడు టైటిల్ తో ఈ మూవీ డబ్బింగ్ అయ్యి ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

అపరిచితుడు సినిమా ద్వారానే చియాన్ విక్రమ్ టాలీవుడ్ లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అప్పటినుంచి ఆయన సినిమాలు రెగ్యులర్ గా తమిళ్, తెలుగు భాషలలో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఆస్కార్ ఫిలిమ్స్ బ్యానర్ పై రవిచంద్రన్ 20 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా 57 కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో విక్రమ్ మూడు విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. రాము అనే పాత్రలో అమాయక బ్రాహ్మణుడిగా, రెమో క్యారెక్టర్ లో లవర్ బాయ్ గా, అపరిచితుడు క్యారెక్టర్ లో అన్యాయాలు చేసే వారికి శిక్షలు వేసి వ్యక్తిగా నటించారు. ఈ మూడు పాత్రలలో దేనికి అదే ప్రత్యేకంగా ఉండడం విశేషం.

ఈ సినిమా ద్వారా విక్రమ్ మంచి నటుడుగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2005లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికి కూడా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ కారణంగా అపరిచితుడు చిత్రాన్ని మరల రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మే 17న ఈ చిత్రాన్ని తెలుగులో రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ మధ్య కాలంలో సూర్య డబ్బింగ్ మూవీ సూర్య సన్నాఫ్ కృష్ణన్ తెలుగులో రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ నేపథ్యంలో అపరిచితుడు చిత్రానికి కూడా మంచి ఆదరణ వస్తుందని అంచనా వేస్తున్నారు. గతంలో శంకర్ ప్రేమికుడు చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తామని ప్రకటించి వాయిదా వేశారు. అలాగే రజనీకాంత్ శివాజీ మూవీ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఆగిపోయారు. మరి అపరిచితుడు చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తారా అనేది సందేహమే అనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తుంది.

గేమ్ చేంజర్ కి ముందు శంకర్ సినిమాలు రీ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేస్తున్నప్పటికి అస్సలు బజ్ క్రియేట్ చేయడం లేదు. అలాగే ఈ టైమ్ సరైంది కాదనే మాట వినిపిస్తుంది. ఒకవైపు సమ్మర్ హీట్, మరోవైపు ఎన్నికల వేడి. ఎన్నికలకి ముందు ఈ మూవీని రీ రిలీజ్ చేస్తే బాగుండేది అనే అభిప్రాయాన్ని కొంతమంది నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. మే నెలలో టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలే ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో అపరిచితుడు రీ రిలీజ్ ఏమాత్రం ప్రేక్షకులని థియేటర్స్ వరకు రప్పిస్తుంది అనేది వేచి చూడాలి.