'పవన్ సినిమాలకే ఎందుకలా?.. డిప్యూటీ సాబ్ ది స్పష్టమైన వైఖరి'
ఇప్పుడు ఆ విషయంపై మరోసారి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు ముందు థియేటర్స్ బంద్ అనే ప్రకటన ఎందుకు బయటకు వచ్చిందని మరోసారి క్వశ్చన్ చేశారు.
By: Tupaki Desk | 26 May 2025 3:01 PM ISTతెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ అంటూ ప్రకటన.. కొద్ది రోజుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్.. ఈ రెండు అంశాలపై ఇటీవల ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించిన విషయం తెలిసిందే. పవన్ మూవీ రిలీజ్ కు ముందే ఎందుకు ప్రకటన వచ్చిందో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పుడు ఆ విషయంపై మరోసారి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు ముందు థియేటర్స్ బంద్ అనే ప్రకటన ఎందుకు బయటకు వచ్చిందని మరోసారి క్వశ్చన్ చేశారు. పవన్ సినిమాల రిలీజ్ సమయంలో కొందరు కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. పవన్ ది స్పష్టమైన వైఖరన్నారు.
థియేటర్స్ బంద్ అనే విషయం ముందే తెలిసినా ఫిల్మ్ ఛాంబర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఛాంబర్ ముందు స్పందించి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. ఎవరితో చర్చించి థియేటర్ల బంద్ కు పిలుపునిచ్చారో తెలుసుకోవాలని హోంశాఖ కార్యదర్శిని తాను విచారణ చేయమని కోరానని వెల్లడించారు.
అంతేగాని.. అరెస్ట్ చేయమని ఆదేశించలేదని స్పష్టం చేశారు. కొందరు అసలు సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే ఫ్లాప్ అంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. సినిమాల విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా అన్నారు. బాధ్యత ఉన్న ప్రజా ప్రతినిధిగా సినిమా మ్యాటర్ లో అలా మాట్లాడటం చాలా తప్పు అని ఆయన చెప్పారు.
అదే సమయంలో ఏపీ ప్రభుత్వాన్ని కలవాల్సిందని నిర్మాత అల్లు అరవింద్ ఇప్పుడు చెప్పడం హర్షణీయమని అన్నారు. అయితే సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని కలుస్తారా లేదా అనేది వాళ్ల ఇష్టమని, వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. కానీ తమను కలవలేదని ఏ రోజు కూడా తెలుగు సినిమా నిర్మాతల్ని ఇబ్బంది పెట్టలేదని, అలా జరగదని చెప్పారు.
కాగా, సినిమా టికెట్ల రేట్లకు సంబంధించిన శాశ్వత విధానాన్ని ఏపీ ప్రభుత్వం రూపొందించబోతుందని వెల్లడించారు. ప్రతిసారీ ఎవరో ఒకరు టికెట్ రేట్లు పెంచమని వస్తున్నారని, తాము ఓకే చేస్తున్నామని, అది తెలిసిన విషయమేనని అన్నారు. కానీ ఎవరో ఒకరు కోర్టుల్లో పిల్ వేస్తున్నారు. అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పారు. అందుకే కొత్త విధానం రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.
