పవన్ కళ్యాణ్‌ను అలా టార్గెట్ చేస్తే.. ఇక చర్యలు తప్పవు!
ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన కొన్ని మార్ఫింగ్ ఫొటోలు, అసభ్య పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 22 July 2025 3:37 PM ISTఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు, మహిళలపై నెగిటివ్ కామెంట్స్, మార్ఫింగ్ చేసిన ఫొటోలు పోస్ట్ చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మహిళలను, కుటుంబ సభ్యులను లాక్కొచ్చి ట్రోలింగ్ చేసే వారిని ఉపేక్షించబోమని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. దీనికి సంబంధించి ప్రభుత్వంలో భాగమైన ముఖ్య నాయకులు కూడా తాజా పరిణామాల నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు.
ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన కొన్ని మార్ఫింగ్ ఫొటోలు, అసభ్య పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సమయంలో, కొందరు వీడియో క్లిప్పింగ్ ను మోర్ఫ్ చేసి నెగటివ్ గా ప్రదర్శించారు. దీంతో పవన్ అభిమానులు, జనసేన నాయకత్వం స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జనసేన కీలక నేత ఒకరు మీడియాకు మాట్లాడుతూ, "మేము నిర్మాణాత్మక విమర్శలు, చర్చలను ప్రోత్సహిస్తాము. కానీ మహిళలపై అసభ్యంగా మాట్లాడడం, ఫ్యామిలీలను లాగడం, మార్ఫ్ చేసిన ఫొటోలు పోస్ట్ చేయడం అస్సలు సహించము. ఇలాంటి పనులు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. వారి అసలైన ఐడెంటిటీని ట్రాక్ చేసి, చట్టపరంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం. మీ మాటలు, పనులు మీ జీవితంపై ప్రభావం చూపుతాయి. పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి," అని హెచ్చరించారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసినవారు, మార్ఫింగ్ ఫొటోలు పోస్ట్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. పోలీసులు, అధికార యంత్రాంగం ఇప్పటికే కేసులను నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో ఇలాంటి పోస్టులకు పెద్దగా పట్టించుకోకపోయినా, ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.
ఈ నేపధ్యంలో, సోషల్ మీడియా యూజర్లు ఇకపై ఏదైనా కామెంట్ పెట్టేముందు, పోస్టు చేయేముందు ఆలోచించాల్సిందే. విమర్శలు చేయడం వేరు, వ్యక్తిగత దూషణలకు దిగడం వేరు. ఏదేమైనా రాబోయే రోజుల్లో సోషల్ మీడియా బాధ్యతగా వాడాలి, ట్రోలింగ్ కు ఎక్కడ కూడా స్థానం ఉండదని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఇక హరిహర వీరమల్లు సినిమా 24వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
