బత్తాయిల్ని బత్తాయిలతోనే కొట్టమని చెప్పాడు..యుద్ధం ప్రకటించిన అన్వేష్!
యూట్యూబర్ అన్వేష్ ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. హిందూ దేవతలపై అసభ్యకరంగా మాట్లాడడంతో అన్వేష్ పై అనేక మంది మండిపడుతున్నారు.
By: M Prashanth | 2 Jan 2026 10:18 AM ISTయూట్యూబర్ అన్వేష్ ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. హిందూ దేవతలపై అసభ్యకరంగా మాట్లాడడంతో అన్వేష్ పై అనేక మంది మండిపడుతున్నారు. హిందూ సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అతనికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేయడమే కాదు, యూట్యూబ్ ఛానెల్ ను బాయ్ కాట్ చేయాలంటూ కూడా పిలుపునిస్తున్నారు. దీంతో అన్వేష్ ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోతోంది. అంతే కాదు.. అతడిపై తెలుగు రాష్ట్రాల్లో అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
అదే సమయంలో ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ పేరుతో కొత్త వీడియో పోస్ట్ చేశాడు అన్వేష్. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అనేక మంది రెస్పాండ్ అవుతున్నారు. "రాత్రి ఆంజనేయ స్వామి కలలో కనపడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఇచ్చాడు. వినాయకుడు ఉన్నాడుగా, పక్కన సుబ్రహ్మణ్యుడు పెట్టుకో విజయాలు కలుగుతాయని చెప్పాడు. నన్ను కొన్నాళ్లు ట్రావెలింగ్ పక్కనపెట్టి ప్రజా సమస్యలపై పోరాడమన్నాడు. కాషాయం రంగు కప్పుకొని దేశాన్ని దోచుకుంటున్నారట. వాళ్ల అంతు చూడమని చెప్పారు బత్తాయిల్ని బత్తాయిలతోనే కొట్టమని చెప్పాడు" అని అన్వేష్ చెప్పాడు.
"కొందరు స్వామి మాల వేసుకొని మోసం చేస్తున్నారు. వాళ్ల అంతు చూడమని చెప్పాడు. సీతమ్మను అంటే ఎవరైనా ఏమైనా అంటే చూసుకోవడానికి నేనున్నాను.. నువ్వు మంచోడివి.. నువ్వేం చేయలేదు.. బెట్టింగ్ యాప్స్ అన్నీ ఆపేసావు కదా.. వారందరికీ డబ్బులు లేవు. ఎప్పుడు దొరుకుతావా అని వాళ్లే నిన్ను ఇరికించారు. బూతులు ఆడొద్దని చెప్పారు. 2026 బూతులు మాట్లాడనని ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి చెబుతున్నా. ఒకవేళ బూతులు ఆడినా చెప్పు ఇచ్చి కొట్టండి. 2026 అంతా ప్రజా సమస్యలపై పోరాడమన్నాడు. ముఖ్యంగా ఆడవారి సమస్యలపై పోరాటం చేయమన్నాడు. దేశంలో స్త్రీలకు స్వేచ్ఛ లేదట. అందుకే వారి స్వేచ్ఛ కోసం పోరాటమని దేవుడు నాతో చెప్పారు" అని అన్నాడు.
"కొందరు దోపిడీలు దొంగతనాలు చేస్తూ జై శ్రీరామ్ అంటున్నారు.. ఇండియా రాముడి పేరుతో బోలెడు మోసం జరుగుతోందట. మతం మత్తులో అన్యాయాలు, అక్రమాలు చేసి జైశ్రీరామ్ అంటున్నారట. అలాంటి బత్తాయిలను కొట్టమని దేవుడు చెప్పాడు. చాలా మంది వింగ్స్ ఉన్నాయట. ఆ రెక్కలను ఒక్కొక్కటిగా నరికేయమని చెప్పాడు. ఏడాదంతా ప్రజా సమస్యలపై పోరాటం చేయమన్నాడు" అని తెలిపాడు.
"రోజుకు 16 గంటలు కష్టపడి, 8 వీడియోలు పెడతానంటే ఓకే చెప్పాడు.. 2 కోట్లు సంపాదించి, యాభై లక్షలు ఇండియాకు ట్యాక్స్ కట్టమని దేవుడు చెప్పాడు. కట్టేస్తా... ఇండియాలో ఉన్న మీడియా వారు డబ్బులకు అమ్ముడుపోతారట. రాజకీయం ఉంటుందని అన్నాడు. ఒక్కొక్కరిని బూతులు లేకుండా కొట్టిపారేయమని, దుష్టులను, దుర్మార్గులను చంపేయమన్నాడు. నా వీడియోతో వెన్ను పుట్టాలట" అని తెలిపాడు. దీంతో అన్వేష్ కు ఇంకా ఏ విధంగా కూడా తగ్గలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మళ్లీ దేవుడు పేరు ఉపయోగించి తాను చేయబోతున్న పనుల గురించి చెప్పడంపై మండిపడుతున్నారు.
