Begin typing your search above and press return to search.

మిస్ శెట్టి ఇక రానట్లేనా?

కనీసం సక్సెస్ మీట్ లో అయిన పాల్గొంటే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాని అది కూడా సాధ్యంకాకపోవచ్చని మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   11 Sep 2023 2:30 PM GMT
మిస్ శెట్టి ఇక రానట్లేనా?
X

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ థియేటర్స్ లోకి వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. యూవీ క్రియేషన్స్ లో మహేష్ దర్శకుడిగా తెరకెక్కిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులని మెప్పిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యత అంతా కూడా నవీన్ పొలిశెట్టి దగ్గరుండి చూసుకొని మూవీకి హైప్ తీసుకొచ్చాడు.

అలాగే మంచి ఓపెనింగ్స్ రావడానికి కారణం అయ్యాడు. అనుష్క కూడా ప్రమోషన్స్ కి వచ్చి ఉంటే కచ్చితంగా మరింత హైప్ వచ్చి ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చేవి. అయితే ఏవో వ్యక్తిగత కారణాల వలన ఆమె ప్రమోషన్స్ కి రాలేకపోయింది. అయితే అనుష్కతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ షూట్ చేసి రిలీజ్ కి ముందు వదలాలని అనుకున్నారంట. మరి ఏమైందో విడుదల చేయలేదు.

అయితే సినిమా పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ కావడంతో ఇంటర్వ్యూని రిలీజ్ చేసే అవకాశం లేకుండా పోయింది. కనీసం సక్సెస్ మీట్ లో అయిన పాల్గొంటే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాని అది కూడా సాధ్యంకాకపోవచ్చని మాట వినిపిస్తోంది. ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన కథానాయిక అనుష్కని చూడాలని ఆరాటపడుతున్నారు.

పోనీ ఆమె సినిమాలు పూర్తిగా ఆపేసిందా అంటే అలాంటిదేం లేదు. ఇప్పటికే మలయాళంలో తన డెబ్యూ మూవీలో నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్ లో హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోన్న సినిమాలో అనుష్క కీలక పాత్రలో కనిపించబోతోంది. తమిళ్ లో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. అలాగే తెలుగులో కూడా ఇప్పటికే ఒక కథవిన్నట్లు ఫోన్ ఇంటర్వ్యూలో పేర్కొంది.

అయితే ప్రస్తుతం అనుష్క బరువు తగ్గే పనిలో ఉందని, దానికోసం మీడియాకి దూరంగా ఎవరికి కనిపించకుండా ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. కంప్లీట్ స్లిమ్ అయ్యి మునుపటి లుక్ లోకి మారిన తర్వాత ఒకేసారి అందరి ముందుకి వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.