Begin typing your search above and press return to search.

అనుష్క శెట్టి.. అప్పట్లా లేదు!

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ స్వీటీ అనుష్క శెట్టి

By:  Tupaki Desk   |   10 April 2024 4:42 AM GMT
అనుష్క శెట్టి.. అప్పట్లా లేదు!
X

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ స్వీటీ అనుష్క శెట్టి. అనుష్క శెట్టి గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో అనుష్క అస్సలు పార్టిసిపేట్ చేయలేదు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాని నవీన్ పొలిశెట్టి తన భుజాలపై వేసుకొని మార్కెట్ లోకి తీసుకొని వెళ్ళాడు.

ఈ మూవీ తర్వాత స్వీటీ శెట్టి నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేయడానికి చాలా సమయం తీసుకుంది. ప్రస్తుతం మలయాళంలో కథానార్ అనే పాన్ ఇండియా సినిమాలో అనుష్క శెట్టి నటిస్తోంది. అందులో ఆమెదే లీడ్ రోల్. అలాగే తెలుగులో క్రిష్ దర్శకత్వంలో లేడీ ఒరియాంటెడ్ మూవీ చేస్తోంది. ఈ సినిమా కూడా సెట్స్ పైనే ఉంది.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాహుబలి 2 తర్వాత ఇప్పటి వరకు జేజమ్మ నిశ్శబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలతో మాత్రమే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రస్తుతం తెలుగులో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ గా అనుష్క ఉంది. అయితే అనుష్కకి హీరోయిన్ గా స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు వస్తున్నాయంట.

కానీ ఆమె తిరస్కరిస్తుందని తెలుస్తోంది. కేవలం లేడీ ఒరియాంటెడ్ కథలతో సినిమాలు చేయడానికి ఈ బ్యూటీ ఆసక్తి చూపిస్తుందంట. కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ హీరోలతో జతకట్టడానికి ఆమె అంత ఆసక్తిగా లేదనే మాట వినిపిస్తోంది. లేడీ ఒరియాంటెడ్ మూవీస్ కూడా చాలా సెలక్టివ్ గానే చేయాలని అనుకుంటుందని టాక్.

అనుష్క శెట్టిని వీలైనన్ని ఎక్కువ సినిమాలలో ఆడియన్స్ చూడాలని అనుకుంటున్నారు. కానీ ఆమె మాత్రం ఫీమేల్ సెంట్రిక్ కథలపైన, అలాగే హిస్టారికల్ నేపథ్యం ఉన్న కథలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. ఇలాంటి కథలు చేయాలంటే భారీ బడ్జెట్ పెట్టాలి. అయితే అనుష్క మార్కెట్ రేంజ్ గట్టిగానే ఉన్నా కాంటెంట్ పర్ఫెక్ట్ గా లేకపోతే మొదటికే మోసం వస్తుంది.

నిశ్శబ్దం లేడీ ఒరియాంటెడ్ మూవీగా వచ్చిన డిజాస్టర్ టాక్ అందుకుంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా మెజారిటీ క్రెడిట్ నవీన్ పొలిశెట్టికి దక్కింది. ఈ నేపథ్యంలో ఆమె లీడ్ రోల్ లో మూవీ వచ్చి బిగ్ స్క్రీన్ పై సక్సెస్ అవ్వాలి. అప్ప్పుడు వచ్చే కలెక్షన్స్ బట్టి నెక్స్ట్ ఆమెతో లేడీ ఒరియాంటెడ్ సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపించవచ్చు.