Begin typing your search above and press return to search.

యాధార్ధ సంఘ‌ట‌న ఆధారంగా అనుష్క సినిమా!

అయితే ఈఘ‌ట‌న చాలా కాలం క్రితం చోటుచేసుకున్నంద‌ని అంటున్నారు. ఒక‌ప్పుడు ఒడిశా పేరు ఒరిస్సాగా ఉండేది

By:  Tupaki Desk   |   12 Feb 2024 3:30 PM GMT
యాధార్ధ సంఘ‌ట‌న ఆధారంగా అనుష్క సినిమా!
X

స్వీటీ అనుష్క‌- క్రిష్ అభిమానుల్ని ఒక్క‌సారిగా స‌డెన్ స‌ర్ ప్రైజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. క‌నీసం గాసిప్ కూడా లేకుండా ఇద్ద‌రి సినిమా ప‌ట్టాలెక్క‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అనుష్క‌ని మెయిన్ లీడ్ లో పెట్టి ఏకంగా ఓ లేడీ ఓరియేంటెడ్ సినిమాకే తెర తీసారు. దీన్ని అంతే ప్ర‌తిష్టాత్మ‌కంగా యూవీ క్రియేష‌న్స్ నిర్మిం చ‌డం విశేషం. ప‌డిపోయిన అనుష్క గ్రాప్ ని మ‌ళ్లీ పైకి లేపాల‌ని యూవీ-క్రిష్ ఈ బాధ్య‌త‌లు తీసుకున్నట్లు తెలుస్తోంది. సోలోగా బాక్సాఫీస్ వ‌ద్ద అనుష్క స‌త్తా ఏంటో చూపించాల‌ని యూవీ సంస్థ ముందుకొచ్చి చేస్తోన్న చిత్రం.

స‌ద‌రు సంస్థ‌తో అనుష్క బాండింగ్ తోనే ఇది సాధ్య‌మైందన్న‌ది తెలిసిందే. మ‌రి క్రిష్..అనుష్క‌ని ఎలాంటి క‌థ‌లో చూపించ‌బోతున్నాడు? అంటే సంచ‌ల‌న అంశాన్ని స్టార్ మేక‌ర్ ట‌చ్ చేస్తున్న‌ట్లు లీకులందు తున్నాయి. ఏకంగా మ‌హిళా లోకమే దిగొచ్చేలా క్రిష్ స‌రైన పాయింట్ నే ఎత్తుకున్న‌ట్లు వినిపిస్తోంది. ఒడిశాల్లో ఓ అమ్మాయి జీవితంలో చోటు చేసుకున్న య‌ధార్ధ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రం రూపొందు తుంద‌ని టాక్ వినిపిస్తుంది.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాల్లో జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే అనుష్క ఓ హోట‌ల్ నుంచి వ‌స్తోన్న వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ స్పాట్ ఎక్క‌డ‌? అంటే ఒడిశా అని తేలింది. దానికి సంబంధించిన తీగ క‌దిపితే ఇలా ఢొంకంతా క‌దులుతుంది. తొలి షెడ్యూల్ ఒడిశాల్లో చేయ‌డానికి కార‌ణం కూడా అదే అంటున్నారు. అనుష్క‌పై అక్క‌డ కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నార‌ని స‌మాచారం. అయితే ఆ అమ్మాయికి జ‌రిగిన య‌ధార్ధ సంఘ‌ట‌న ఎలాంటింది అన్న వివ‌రాలు మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.

అయితే ఈఘ‌ట‌న చాలా కాలం క్రితం చోటుచేసుకున్నంద‌ని అంటున్నారు. ఒక‌ప్పుడు ఒడిశా పేరు ఒరిస్సాగా ఉండేది. సినిమాలో ఆ పాత పేరు టైటిల్స్ లో క‌నిపిస్తుంద‌ని స‌మాచారం. అంటే ఈ ఘ‌ట‌న చాలా పాత‌ద‌ని తెలుస్తోంది. అంటే ప‌దేళ్ల క్రితం నాటి ఘ‌ట‌న అని చెప్పొచ్చు. 2011 లోనే ఒరిస్సా పేరు ఒడిశాగా మారింది. ఏది ఏమైనా క్రిష్ ట‌చ్ చేసిన పాయిట్ అసామ‌న్య‌మైన‌దిగా ఉంటుంద‌న‌డంలో సందే హం లేదు. అందులోనూ య‌ధార్ధ గాధ‌లో ఎమోష‌న్ చూపించ‌డంలో క్రిష్ చెల‌రేగిపోతాడు.