Begin typing your search above and press return to search.

అనుష్క ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

స్వీటీ అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత మళ్లీ సినిమాలు చేస్తుందా లేదా అన్న డౌట్ అయితే ఆమె ఫ్యాన్స్ లో ఉంది

By:  Tupaki Desk   |   7 Feb 2024 1:35 PM GMT
అనుష్క ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
X

స్వీటీ అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత మళ్లీ సినిమాలు చేస్తుందా లేదా అన్న డౌట్ అయితే ఆమె ఫ్యాన్స్ లో ఉంది. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అనుష్క సినిమాలు చేసేందుకు ఓకే అంటున్నా ఆమె మనసుకి దగ్గరైన కథలు రావట్లేదని తెలుస్తుంది. అయితే ఈమధ్యనే స్టార్ డైరెక్టర్ క్రిష్ అనుష్కని కలిసి ఒక కథ వినిపించారట. దాదాపు ఈ కాంబోలో సినిమా ఫిక్స్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు. అనుష్క ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేస్తే ఆ ప్రాజెక్ట్ పై సూపర్ బజ్ ఏర్పడుతుంది.

అది అరుంధతి నుంచి అలా కొనసాగుతుంది. అరుంధతి తర్వాత అలాంటి ప్రయోగాలు రెండు మూడు చేసిన అనుష్క ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ భాగమతి అనే సినిమా చేసింది. అశోక్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా మరోసారి అనుష్క స్టామినా ఏంటో చూపించి స్టార్ సినిమా వసూళ్లకు ధీటుగా కలెక్ట్ చేసింది. అయితే ఆ తర్వాత నిశ్శబ్ధం అనే ప్రయత్నం చేసినా వర్క్ అవుట్ కాలేదు.

మరోసారి అరుంధతి, భాగమతి టైప్ లో ఒక భారీ సినిమా చేయాలని అనుకుంటుంది అనుష్క. క్రిష్ కథ కూడా అలాంటి కథాంశం అవ్వడంతో వెంటనే అనుష్క ఆ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిందని తెలుస్తుంది. ఆల్రెడీ క్రిష్ డైరెక్ట్ చేసిన వేదం సినిమాలో అనుష్క నటించింది. సో డైరెక్టర్ మీద ఆమెకు మంచి నమ్మకం ఉంది.

ఈ సినిమాను క్రిష్ తన సొంత బ్యానర్ ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మిస్తారని తెలుస్తుంది. క్రిష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా హరి హర వీరమల్లు సినిమా సెట్స్ మీదకు వెళ్లి నాలుగేళ్లు అవుతున్నా సినిమా ఇంతవరకు పూర్తి కాలేదు. ఆ సినిమా పూర్తి చేసేందుకు పవన్ ఖాళీగా లేడు. అందుకే క్రిష్ అనుష్కతో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ అనుష్కతో క్రిష్ చేస్తున్న ఈ ప్రయోగం ఏంటి..? ఆ సినిమా ఎలా ఉండబోతుంది..? లాంటి విషయాలు త్వరలో తెలుస్తాయి.

బాలకృష్ణతో ఎన్.టి.ఆర్ బయోపిక్ గా చేసిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు తీసిన క్రిష్ ఆ తర్వాత వెంటనే పవన్ తో వీరమల్లు ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచగా పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్స్ తో సర్ ప్రైజ్ చేశారు. కాకపోతే సినిమా పూర్తి చేసేందుకు పవన్ డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు. అందుకే క్రిష్ వెయిట్ చేసి చేసి మరో సినిమా మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యాడు.