Begin typing your search above and press return to search.

అనుష్క రెండో బేబి.. ఇంకా క‌న్ఫామ్ చేయ‌లేదు!

అనుష్క శర్మ గత కొంతకాలంగా అందరి దృష్టికి దూరంగా ఉంది. చివరిసారిగా షారూఖ్ ఖాన్ స‌ర‌స‌న `జీరో`లో పెద్ద తెరపై కనిపించింది.

By:  Tupaki Desk   |   15 Dec 2023 11:30 AM GMT
అనుష్క రెండో బేబి.. ఇంకా క‌న్ఫామ్ చేయ‌లేదు!
X

అనుష్క శర్మ గత కొంతకాలంగా అందరి దృష్టికి దూరంగా ఉంది. చివరిసారిగా షారూఖ్ ఖాన్ స‌ర‌స‌న `జీరో`లో పెద్ద తెరపై కనిపించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవంగా ప్రదర్శిత‌మైంది. క్రికెటర్ కం భర్త విరాట్ కోహ్లీతో అనుష్క‌ త్వ‌ర‌లో త‌న‌ రెండవ బిడ్డను ఆశిస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి. ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఎలాంటి రిపోర్టులకు ఈ జంట స్పందించక‌పోవ‌డంతో ఊహాగానాలు మ‌రింత‌గా పెరిగాయి. విరాట్‌తో కలిసి విహారయాత్రలో ఉన్న‌ప్పుడు అనుష్క‌ బేబీ బంప్ కి సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు కొన్ని నెలలుగా సోషల్ మీడియాల్లో వైర‌ల్ అయ్యాయి.

ఇప్పుడు విరాట్‌తో క‌లిసి అనుష్క తన బేబీ బంప్‌ను జాగ్ర‌త్త‌గా చేత్తో సుతారంగా ట‌చ్ చేస్తూ క‌నిపించిన‌ ఫోటో ఒక‌టి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో విరాట్ తన కుడి చేతిని అనుష్క భుజం చుట్టూ చుట్టి కెమెరా ముందు నవ్వులు చిందించాడు. బంగారు రంగు చీరలో ఉన్న అనుష్క‌ ఫోటోలో నిండు గర్భిణిగా కనిపిస్తోంది.

అయితే ఇది లేటెస్ట్ ఫోటోయేనా? అన్న‌ది ఆరా తీస్తే అస‌లు సంగతి తెలిసింది. 2018లో దీపావళి నాడు అనుష్క అదే చీరను ధరించింది. వాస్తవానికి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫోటోని షేర్ చేసింది. అందులో అనుష్క‌-విరాట్ వారి అపార్ట్మెంట్ బాల్కనీలో పోజులిస్తూ క‌నిపించారు. అనుష్క సోదరుడు కర్నేష్ శర్మ కూడా 2018లో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అదే దుస్తులలో ఉన్న ఫోటోని అప్ప‌ట్లో షేర్ చేసారు. కానీ ఇప్పుడు అదే ఫోటో మ‌రోసారి అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది.

విరాట్ కోహ్లి-అనుష్క శర్మ జనవరి 2021లో తమ కుమార్తె వామిక కోహ్లీకి స్వాగతం పలికారు. సెల‌బ్ ప్ర‌పంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో వీరి ప్ర‌ధాన్యత వేరు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అనుష్క తదుపరి స్పోర్ట్స్ బయోపిక్ చక్దా ఎక్స్‌ప్రెస్‌లో కనిపించనుంది. ప్రొసిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా రూపొందింది. అనుష్క‌ చివరిసారిగా ఖాలాలో ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించింది.