Begin typing your search above and press return to search.

ఆర్సీబీ హడావుడిలో అనుష్క స్పెషల్ పార్టీలు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, టీం ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 May 2024 11:36 AM GMT
ఆర్సీబీ హడావుడిలో అనుష్క స్పెషల్ పార్టీలు
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, టీం ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ స్టార్ కపుల్ రెండో సారి తల్లిదండ్రులయ్యారు. ఆ బాబుకు అకాయ్ అని కూడా నామకరణం చేశారు. లండన్ లో ప్రసవించిన అనుష్క శర్మ.. ఇటీవల అకాయ్ ను పట్టుకుని భారత్ కు తిరిగి వచ్చింది. రీసెంట్ గా అనుష్క.. మే 1వ తేదీన తన 36వ పుట్టినరోజు జరుపుకుంది.


భర్త విరాట్ కోహ్లీ, పిల్లలు, కుటుంబంతో కలిసి ఈ స్పెషల్ డేను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ లూపా (LUPA)లో డిన్నర్ పార్టీని ఏర్పాటు చేశారు విరాట్- అనుష్క. ఈ పార్టీలో క్రికెటర్ గ్లెన్ మాక్స్ వెల్, అతడి భార్య విని రామన్ పాల్గొన్నారు. వారితో పాటు ఫా డుప్లెసిస్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు అటెండ్ అయ్యారు. వీరంతా కలిసి డిన్నర్ ను ఎంజాయ్ చేశారు.

అంతా కలిసి డిన్నర్ చేశాక ఫోటోలకు పోజులిస్తూ సందడి చేశారు. ఈ స్పెషల్ మూమెంట్స్ ను విరాట్, అనుష్కతో పాటు డుప్లెసిస్ నెట్టింట షేర్ చేశారు. ప్రస్తుతం అనుష్క శర్మ బర్త్ డే పార్టీకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. బాగా ఎంజాయ్ చేసినట్టు ఉన్నారుగా అని ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అనుష్క శర్మ.. ఎవర్ గ్రీన్ లుకింగ్ అంటూ పొగుడుతున్నారు. .

ఇక క్రికెటర్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో విరాట్, అనుష్కల మధ్య ప్రేమ చిగురించింది. ఓ షాంపూ యాడ్ లో పరిచయమైన వీరు.. స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. 2017లో ఇరువైపుల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇటలీ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా ఒక్కటయ్యారు. అప్పట్లో వీరి పెళ్లి ట్రెండ్ సెట్ చేసింది. అనేకమంది సెలబ్రిటీల వివాహాలకు థీమ్ గా మారింది.

విరాట్, అనుష్కల వివాహ బంధానికి గుర్తుగా 2021లో వామిక జన్మించింది. ఆ తర్వాత రీసెంట్ గా మగబిడ్డ అకాయ్ కు జన్మనిచ్చింది అనుష్క శర్మ. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. తన ఫ్యామిలీతో క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తోంది. మరోవైపు, విరాట్ ప్రస్తుతం ఐపీఎల్ లో రాణిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్.. తన ఆటతీరుతో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. త్వరలో పొట్టి వరల్డ్ కప్ కూడా ఆడనున్నాడు.