Begin typing your search above and press return to search.

అనుష్కతో నవీన్.. కథ కలిపిన కాంబినేషన్..!

అసలు ఈ కాంబినేషన్ ఎలా కుదురింది అన్న డీటైల్స్ లోకి వెళ్తే.. మహేష్ రాసుకున్న కథ వల్లే ఈ కాంబో సెట్ అయ్యిందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   25 Aug 2023 1:30 AM GMT
అనుష్కతో నవీన్.. కథ కలిపిన కాంబినేషన్..!
X

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి యువ హీరో నవీన్ పొలిశెట్టి ఇద్దరు కలిసి ఒక సినిమాలో లీడ్ పెయిర్ గా నటిస్తారని అసలు ఊహించి ఉండరు. సినిమా పరిశ్రమలో ఎలాంటి మ్యాజిక్ అయినా జరగొచ్చు అలానే యువ హీరోతో అనుష్క జత కట్టాల్సి వచ్చింది. నవీన్ పొలిశెట్టి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక పాత్ర చేశాడు. ఆ తర్వాత నార్త్ సైడ్ వెళ్లి అక్కడ కామెడీ షోలు చేసి అక్కడ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో తెలుగులో హీరోగా మొదటి ప్రయత్నం చేశాడు.

ఆ సినిమా హిట్ అవడంతో నెక్స్ట్ వెంటనే జాతిరత్నాలు సినిమా అందుకున్నాడు. రెండు సినిమాలతోనే నవీన్ పొలిశెట్టి భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. తన సినిమాలే కాదు బయట కూడా తన కామెడీతో అందరినీ అలరిస్తుంటాడు నవీన్. అలాంటి నవీన్ అనుష్కతో స్క్రీన్ షేర్ చేసుకుని ఆమె సినిమాలో హీరోగా నటిస్తాడని ఊహించి ఉండరు. అసలు ఈ కాంబినేషన్ ఎలా కుదురింది అన్న డీటైల్స్ లోకి వెళ్తే.. మహేష్ రాసుకున్న కథ వల్లే ఈ కాంబో సెట్ అయ్యిందని తెలుస్తుంది.

తన కన్నా ఎక్కువ వయసు ఉన్న అమ్మాయితో ప్రేమలో పడే కథతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా వస్తుందట. ఈ సినిమాలో అనుష్క పాత్ర కూడా ప్రెగ్నన్సీకి పెళ్లితో పనేంటి అనేంత బోల్డ్ క్యారెక్టర్.. సో తన కన్నా తక్కువ వయసు ఉన్న వ్యక్తితో ఆమె ఎలా లవ్ లో పడింది ఆ తర్వాత వారికి వచ్చిన సమస్యలు ఏంటన్నది ఈ సినిమా కథ. నవీన్ తన ఎనర్జీతో సినిమాకు బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నా ఆల్రెడీ అనుష్క ఉంది కాబట్టి ఆమె ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్ర్తిగా ఎదురుచూస్తున్నారు.

సో కథ కలిపిన కాంబినేషన్ గా నవీన్ అనుష్కల జోడీతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా వస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ రిలీజ్ ముందే ప్రమోషన్స్ టూర్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాను ప్రేక్షకుల్లోకి బాగా తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ టూర్లు బాగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. ఆల్రెడీ రెండు హిట్లతో సూపర్ జోష్ లో ఉన్న నవీన్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో హ్యాట్రిక్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. నవీన్ మాత్రం సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.