Begin typing your search above and press return to search.

అనుష్క స‌డెన్ స‌ర్ ప్రైజ్ ఏంటి ఇలా!

స్వీటీ అనుష్క `మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి` తో మ‌ళ్లీ టాలీవుడ్ లో కంబ్యాక్ అయిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Feb 2024 10:40 AM GMT
అనుష్క స‌డెన్ స‌ర్ ప్రైజ్ ఏంటి ఇలా!
X

స్వీటీ అనుష్క `మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి` తో మ‌ళ్లీ టాలీవుడ్ లో కంబ్యాక్ అయిన సంగ‌తి తెలిసిందే. కానీ అనుష్క రేంజ్ హిట్ కాదిది. ఆ సినిమా త‌ర్వాత మ‌రో తెలుగు సినిమాకు ఇంత‌వ‌ర‌క‌కూ సైన్ చేసింది లేదు. `భాగ‌మ‌తి-2` లో న‌టిస్తుంద‌ని ప్ర‌చారం సాగుతుంది త‌ప్ప అందులో వాస్త‌వం ఏంటి? అన్న‌ది క్లారిటీ లేదు. అటు యూనిట్ గానీ...ఇటు అనుష్క గానీ అధికారికంగా స్పందించింది లేదు. ఇక మాలీవుడ్ లో మాత్రం క‌ధ‌నార్ సినిమాతో లాంచ్ అవుతుంది.


అక్క‌డ ఎన్ని సినిమాలు చేస్తుంది అన్న‌ది తెలియ‌దుగానీ అక్క‌డే యాక్టివ్ గా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతానికి అనుష్క జ‌ర్నీ అలా సాగుతుంది. అయితే తాజాగా అనుష్క చాలా గ్యాప్ త‌ర్వాత జ‌నాల మ‌ధ్య‌లో క‌నిపించింది. ఓ హోట‌ల్ లో అమ్మ‌డు కనిపించిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవు తుంది. అందులో అనుష్క చుడిదర్ డ్రెస్ లో ఉంది. మూతికి మాస్క్ కూడా ధ‌రించింది. త‌న‌ని ఎవ‌రు గుర్తు ప‌ట్ట‌కుండా క‌నిపిస్తుంది.

అభిమానుల్నిచూసి కూడా ప‌ట్టించుకోకుండా వెళ్లిపోతుంది. దీంతో అమ్మ‌డు ఏదో వ్య‌క్తిగ‌త ప‌నిమీద‌నా? ప్ర‌యివేట్ ఈవెంట్ కోస‌మే హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోలో యువి క్రియేషన్స్‌కు చెందిన ప్రమోద్‌ కూడా ఉన్నారు. యూవీ క్రియేష‌న్స్ అనుష్క బాండింగ్ గురించి చెప్పాల్సిన పన‌లేదు. అమ్మ‌డిక‌ది సొంత బ్యాన‌ర్ లాంటింది.

అనుష్క తాజా చిత్రాన్ని కూడా అదే బ్యాన‌ర్ లో ప్లాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. మ‌రి అనుష్క ఇలా ప్ర‌త్య‌క్షం అవ్వ‌డం వెనుక సినిమా ప్లానింగ్ ఏదైనా జ‌రుగుతుందా? లేక ఇంకేదైనా ప‌నిమీద వ‌చ్చిందా? అన్న‌ది తెలియాలి. అనుష్క చాలా కాలం త‌ర్వాత బ‌య‌ట క‌నిపించ‌డంతో అభిమానులు ఉత్సాహంగా క‌నిపిస్తున్నారు. మిస్ శెట్టి..మిస్ట‌ర్ పోలిశెట్టి ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో కూడా అనుష్క పాల్గొన‌లేదు. ఆ సినిమా విష‌యంలో కేవ‌లం షూటింగ్ వ‌ర‌కే అనుష్క ప‌రిమిత‌మైంది.