Begin typing your search above and press return to search.

అనుష్కని దాచేయ‌డం వెనుక ఈ క‌హానీ నిజ‌మేనా?

అనుష్క‌..న‌వీన్ పొలిశెట్టి న‌టించిన `మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి` రిలీజ్ సంద‌ర్భంగా ప్ర‌చారం లో ఎక్క‌డా అనుష్క క‌నిపించ‌ని వైనం.

By:  Tupaki Desk   |   7 Sep 2023 5:08 AM GMT
అనుష్కని దాచేయ‌డం వెనుక ఈ క‌హానీ నిజ‌మేనా?
X

అనుష్క‌..న‌వీన్ పొలిశెట్టి న‌టించిన `మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి` రిలీజ్ సంద‌ర్భంగా ప్ర‌చారం లో ఎక్క‌డా అనుష్క క‌నిపించ‌ని వైనం. ఇంట‌ర్వ్యూలు అన్ని న‌వీన్ సింగిల్ గా ఇస్తున్నాడు తప్ప‌...ఎక్క‌డా అనుష్క క‌నిపించ‌లేదు. సినిమా రిలీజ్ అవుతున్నా! అనుష్క ఎందుకు మీడియా ముందుకెందుకు రావ‌డం లేదు? ఏ కార‌ణంతో ముఖం చాటేస్తుంది? అంటూ మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు వెడెక్కిస్తున్నాయి. చిత్ర యూనిట్ ని అడిగితే అదిగో వ‌స్తుంది...ఇదిగో వ‌స్తుంద‌ని చెప్ప‌డం త‌ప్ప అమె మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో అనుష్క గురించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం లీక్ అవుతోంది. సినిమాలో అనుష్క అధిక బ‌రువుతో క‌నిపిస్తుందిట‌. కొన్ని స‌న్నివేశాల కోసం స్పెష‌ల్ గా వ‌ర్క్ చేసి సినిమాలో స‌న్న‌గానూ చూపించా రుట‌. అయితే ఈ విష‌యం ఎక్క‌డా లీక్ కాకుండా ఇంత‌కాలం జాగ్ర‌త్త ప‌డ్డారు. కానీ అనుష్క హైడ్ అవ్వ‌డంతో కార‌ణాలు ఏంటి అని సీరియస్ గా సెర్చ్ చేయ‌డంతో ఈ విష‌యం లీకైంది.

న‌వీన్..అనుష్క ల‌తో సుమ కామ‌న్ ఇంట‌ర్వ్యూ కూడా చేసింది. అదీ కూడా ఇంత వైర‌క్ రిలీజ్ చేయ‌లే దు. ఇవ‌న్నీ విశ్లేషించ‌గా ఈ ప్ర‌చారం నిజ‌మేనా అన్న సందేహాలు బ‌ల‌ప‌డుతున్నాయి. మ‌రి టీమ్ ఇలా ఎందుకు చేస్తున్న‌ట్లు అంటే? అనుష్క కెరీర్ ని దృష్టిలో పెట్టుకునే ఆమె త‌న గురించి ఎలాంటి లీక్ లు ఇవ్వ‌డానికి వీలు లేద‌ని ఆదేశాలు ఇచ్చి ఉండొచ్చ‌ని తెలుస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో అలాంటి బోద్దు వీడియో రిలీజ్ అయితే ట్రోలింగ్ త‌ప్ప‌దు. విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా ఆమె వ‌య‌సు 41.

పైగా అనుష్క చాలా గ్యాప్ త‌ర్వాత చేసిని సినిమా ఇది. మ‌ళ్లీ టాలీవుడ్ లో బిజీ అవ్వాల‌ని సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇత‌ర భాష‌ల్లోనూ పట్టు సాధించాల‌ని సీరియస్ గా ముందుకెళ్తుంది. అలా జ‌ర‌గాలంటే ఇలాంటి వీడియోలు ఎట్టి ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు రాకూడ‌దు. ఆమె నిజంగా పాత్ర కోసం బ‌రువు పెరిగితే యూనిట్ ఆమె ఆదేశాలు పాటించాల్సిందే. అలా కాకుండా అనుష్క స్వ‌యంకృపరాదంతో అలా జ‌రిగితే గ‌నుక బాధ్య‌త వ‌హించాల్సిన అవ‌స‌రం లేదు.