Begin typing your search above and press return to search.

అనుష్క లేటెస్ట్ లుక్.. ఆ అందం తిరిగొచ్చినట్లేనా..

ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్స్ ఉన్నా కూడా అందులో అనుష్కకు ఉన్న క్రేజ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పాలి

By:  Tupaki Desk   |   11 March 2024 1:35 PM GMT
అనుష్క లేటెస్ట్ లుక్.. ఆ అందం తిరిగొచ్చినట్లేనా..
X

ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్స్ ఉన్నా కూడా అందులో అనుష్కకు ఉన్న క్రేజ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పాలి. బాహుబలి లాంటి సక్సెస్ చూసిన తర్వాత కూడా ఆమె చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఉండడం విశేషం. అనుష్క ఓకే చెబితే అడ్వాన్స్ ఇవ్వడానికి ఎంతో మంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఆమెతో కథలు చెప్పాలి అని చాలామంది దర్శకులు కూడా లైన్లో ఉన్నారు.

అయితే అనుష్క మాత్రం ఇప్పుడు రొటీన్ కమర్షియల్ సినిమాలకు పూర్తిగా దూరమవుతోంది. కేవలం డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలే సెలెక్ట్ చేసుకుంటుంది. చిన్న పాత్ర అయినా సరే చాలా డిఫరెంట్ గా ఉండాలి అని ఎలా ఆలోచిస్తోంది. ఇక అనుష్క బాహుబలి తర్వాత తన మునుపటి అందాన్ని కోల్పోయింది అనేలా ఆ మధ్య చాలా రకాల కామెంట్స్ అయితే వచ్చాయి.

బాహుబలి అనంతరం వచ్చిన నుంచి వచ్చిన నిశ్శబ్దం సినిమా ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మళ్ళీ చాలా గ్యాప్ తీసుకుని నవీన్ పోలిశెట్టితో చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మంచి సక్సెస్ అందుకుంది. అందులో కూడా అనుష్క కాస్త బొద్దుగానే కనిపించింది. కాస్త గ్రాఫిక్స్ తో ఆమె లావుగా కనిపించకుండా చేశారు అనేలా కూడా కొన్ని కామెంట్స్ కనిపించాయి.

అయితే అనుష్క మునుపటిలాగా అందంగా కనిపించదా అనే సందేహాలు వస్తున్న తరుణంలో ఇప్పుడు ఆమె తదుపరి సినిమాలో చాలా నాజుగ్గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ గా ఆమెకు సంబంధించిన ఒక లుక్ కూడా వైరల్ గా మారింది. అందులో అనుష్క ఇంతకుముందు సినిమాల కంటే చాలా అందంగా కనిపిస్తోంది. బరువు కూడా తగ్గినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం అనుష్క కథానర్ అనే ఒక మలయాళం సినిమా చేస్తోంది.

పిరియడ్ ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమాను మలయాళం టాలెంటెడ్ దర్శకుడు రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల మొదలైంది. జయసూర్య ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నాడు. అలాగే సీనియర్ నటుడు వినీత్ కూడా ఇందులో ఒక స్పెషల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ లో ఇటీవల పాల్గొన్న అనుష్క దర్శక నిర్మాతలతో కలిసి ఒక ఫోటోకు స్టిల్ ఇచ్చింది. ఇక చిత్ర యూనిట్ ఆమెకు ప్రత్యేకంగా శ్రీకృష్ణ బొమ్మను కూడా కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి అనుష్క చాలా రోజుల తర్వాత రెట్టింపు అందంతో కనిపిస్తోంది అని పాజిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి. మరి రాబోయే సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.