Begin typing your search above and press return to search.

అనుష్క ఇచ్చింది 5 కాదు..50 ముద్దులు!

విరాట్ కొహ్లీ 50 సెంచ‌రీలు పూర్తిచేసి మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన వేళ అనుశ్క శ‌ర్మ గ్యాల‌రీ కూర్చుని ఏ రేంజ్ లో ముద్దుల వ‌ర్షం కురిపించిందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Nov 2023 4:13 PM GMT
అనుష్క ఇచ్చింది 5 కాదు..50 ముద్దులు!
X

విరాట్ కొహ్లీ 50 సెంచ‌రీలు పూర్తిచేసి మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన వేళ అనుశ్క శ‌ర్మ గ్యాల‌రీ కూర్చుని ఏ రేంజ్ లో ముద్దుల వ‌ర్షం కురిపించిందో తెలిసిందే. భ‌ర్త వైపు చూస్తూ అనుష్క ముద్దుల మీద ముద్దులిచ్చేసింది. ఆస‌మ‌యంలో స్పోర్స్ట్ కెమెరా విరాట్ కోహ్లీ ఎమోష‌న్ క‌న్నా..అనుష్క ముద్దుల మీద ఎక్కువ‌గా ఫోక‌స్ చేసింది. ఆ ముద్దుల వీడియో నెట్టింట జోరుగా వైర‌ల్ అయింది.

భ‌ర్త విజ‌యాల్ని కాంక్షిస్తూ భార్య ఇచ్చిన అతిపెద్ద బ‌హుమ‌తి అది. నిజంగా ఇలాంటి ఎమోష‌న్ ద‌క్కినందుకు అనుష్క అదృష్ట వంతురాలు. మ‌రి ఆ ముద్దులు లెక్క ఎంత‌? అంటే విరాట్ కోహ్లీ బాదిన 50 సెంచ‌రీల‌తో స‌మానం అనాలి. అవును ఆ రోజు అనుష్క రెండు..మూడు సార్లు ముద్దులిచ్చి వ‌దిలేయ‌లేదు. త‌దేకంగా ఐదుసార్లు త‌న చేతులు పెదాల్ని ముద్దాడి..వాటిని విరాట్ వైపు వ‌దిలింది. దానిలెక్క 50.

భ‌ర్త ప‌క్క‌నే ఉంటే లెక్క‌లేన‌న్ని ముద్దులిచ్చేది. కానీ విరాట్ అప్పుడు గ్రౌండ్ లో ఉన్నాడు కాబ‌ట్టి ఐదు ముద్దుల‌తో ప‌ది సెంచ‌రీల‌కు ఓ ముద్దు చొప్పున లెక్క గ‌ట్టి ఇచ్చింది. ఆ కాసేప‌టికి విరాట్ కూడా అదే శైలిలో భార్య‌కి ప్రియమైన ముద్దును తిరిగిచ్చాడు. ఆర‌కంగా ఈ జంట ఎప్ప‌టికీ స్పోర్స్ట్ అండ్ సినిమాలో సంథింగ్ స్పెష‌ల్ గా నిలుస్తుంది. అనుష్క విరాట్ని వివాహం చేసుకున్న త‌ర్వాత అత‌ని జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది.

వృత్తి ప‌రంగా అనుష్క రాక‌తో రెట్టించిన‌ ఉత్సాహంతో ముందుకు వెళ్తుంది. ఆ ర‌కంగా విరాట్ చాలా ల‌క్కీ అనాలి. 50 సెంచ‌రీలు కొట్టి అంత‌ర్జాతీయ క్రికెట్ లో ఓ చ‌రిత్ర‌ని సృష్టించాడు. ఇప్ప‌ట్లో విరాట్ రికార్డు ను బ‌ద్ద‌లు కొట్ట‌డం అన్న‌ది సాధ్యం అయ్యే ప‌ని కాదు. క్రీజ్ లో అలా చెల‌రేగ‌డానికి అనుష్క ఓ కార‌ణం కూడా అవ్వొచ్చు