Begin typing your search above and press return to search.

అనుష్క అక్క‌డ‌ అంత డిమాండ్ చేసిందా?

టాలీవుడ్ లో అనుష్క క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఫాంలో ఉన్నంత కాలం అమ్మ‌డిదే నెంబ‌ర్ వ‌న్ స్థానం.

By:  Tupaki Desk   |   14 March 2024 2:30 AM GMT
అనుష్క అక్క‌డ‌ అంత డిమాండ్ చేసిందా?
X

టాలీవుడ్ లో అనుష్క క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఫాంలో ఉన్నంత కాలం అమ్మ‌డిదే నెంబ‌ర్ వ‌న్ స్థానం. పోటీగా ఎంత మంది భామ‌లొచ్చినా? ఆ స్థానం మాత్రం ఎవ‌రికీ ఇవ్వ‌కుండా కాపాడుకుంది. కానీ ఆమె ఎగ్జిట్ త‌ర్వాత ఆ స్థానం అలాగే ఉంది. దూకుడుగా ఉన్నంత కాలం అమ్మ‌డు ఇక్క‌డ భారీగానే పారితోషికం అందుకుంది. ఒక్కో సినిమాకి 10 కోట్ల‌కు పైగానే ఛార్జ్ చేసింది. త‌న‌తో స్నేహం గా ఉన్న నిర్మాణ సంస్థ‌లు సినిమాలో వాటా సైతం క‌ల్పించాయి.


లేడీ ఓరియేంటెడ్ నాయిక‌గానూ స‌త్తా చాటింది. `అరుంధ‌తి` విజ‌యం త‌ర్వాత ఆమెకి ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ క్రియేట్ అయింది. అయితే ఇప్పుడిదే స్టార్ డ‌మ్ అని అమ్మ‌డు మాలీవుడ్ లో స‌క్సెస్ కాక ముందే ఆస్వాది స్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. `క‌థ‌నార్` అనే సినిమాతో అక్కడ లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నుల్లో ఉంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇందులో జైసూర్య హీరోగా న‌టిస్తున్నాడు. మ‌రి ఈ సినిమాకి అనుష్క పారితోషికం ఎంత తీసుకుంటుందో? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

సినిమా కోసం ఏకంగా 10 కోట్లు ఛార్జ్ చేసిందిట‌. అడ్వాన్స్ గా ఆరు కోట్లు ముందే చెల్లించారుట‌. తాజాగా షూట్ పూర్త‌యిన నేప‌థ్యంలో బ్యాలెన్స్ అమౌంట్ కూడా క్లియ‌ర్ చేసిన‌ట్లు తాజాగా అందుతోన్న స‌మాచా రం. అయితే అమ్మ‌డు అక్క‌డంత డిమాండ్ చేయ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. తెలుగు మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని చేసిన‌ట్లు తెలుస్తోంది. `క‌థ‌నార్` ని మాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేయాలన్న‌ది ప్లాన్ గా క‌నిపిస్తుంది.

ఈసినిమా రీమేక్ రైట్స్ ఎవ్వ‌రికి ఇవ్వ‌కుండా తెలుగు నిర్మాణ సంస్థ‌తో ఒప్పందం చేసుకుని ఇక్క‌డా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారుట‌. రెండు భాష‌ల్లోనూ అనుష్క ప్ర‌చారంలో పాల్గొనెలో ఒప్పందం చేసుకున్నారుట‌. ఆ ఒప్పందం ప్ర‌కార‌మే పారితోషికంతో పాటు ప్ర‌చారం కోసం 10 కోట్లు చెల్లించిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి అనుష్క టాలీవుడ్ లో త‌న బ్రాండ్ ఇమేజ్ ను ప‌ర‌భాష‌లో కూడా తెలివిగానే ఎన్ క్యాష్ చేసుకుంటుందని చెప్పొచ్చు.