Begin typing your search above and press return to search.

అనుష్క ఫ్యామిలీ ఫిర్యాదుకు రెడీ అవుతోందా?

పెద్ద‌లు కూడా ఆ పెళ్లికి అంగీకారం తెలిపిన‌ట్లు రూమ‌ర్లు స్ప్రెడ్ అయ్యాయి. అయితే ఈసారి అనుష్క కుటుంబ స‌భ్యులు ఈ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లు ఓ వార్త వైర‌ల్ అవుతుంది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 1:12 PM GMT
అనుష్క ఫ్యామిలీ ఫిర్యాదుకు రెడీ అవుతోందా?
X

డీప్ పేక్ వీడియోల‌తో సెల‌బ్రిటీలు ఎంత‌గా ఇబ్బంది ప‌డుతున్నారో క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంది. ఇటీవ‌లే ర‌ష్మిక‌పై డీప్ పేక్ క్రియేట్ చేసిన వ్య‌క్తిని అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయినా డీప్ ఫేక్ లు మాత్రం య‌ధేశ్చ‌గా వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. ఎవ‌రో ఒక‌రు డీప్ ఫేక్ ల‌కు బ‌ల‌వుతూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం అనుష్క కూడా ఇలాంటి స‌మ‌స్య‌ని ఎదుర్కున్న సంగ‌తి తెలిసిందే.

అనుష్క‌-ప్ర‌భాస్ ల‌కు పెళ్లి అయిన‌ట్లు..వాళ్ల‌కు పిల్ల‌లు ఉన్న‌ట్లు వ‌దిలిన డీప్ ఫేక్ నెట్టింట చ‌క్కెర్లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇద్ద‌రి అభిమానులు భ‌గ్గుమ‌న్నారు. ఆగంతుకుడి కి సోష‌ల్ మీడియా వేదిక‌గా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా స‌రే అనుష్క‌ని ఎవ‌రో ప‌నిగ‌ట్టుకుని టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. అనుష్క‌కి ఓ స్టార్ క్రికెట‌ర్ తో పెళ్లి అంటూ ఆమె ఫోటోల‌తో అటుపై కొత్త ప్ర‌చారానికి తెర లేచింది.

పెద్ద‌లు కూడా ఆ పెళ్లికి అంగీకారం తెలిపిన‌ట్లు రూమ‌ర్లు స్ప్రెడ్ అయ్యాయి. అయితే ఈసారి అనుష్క కుటుంబ స‌భ్యులు ఈ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లు ఓ వార్త వైర‌ల్ అవుతుంది. అనుష్క‌ని టార్గెట్ చేసిన వ్య‌క్తిపై చ‌ట్ట‌పర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కుటుంబ స‌భ్యులు భావిస్తున్న‌ట్లు నెట్టింట ప్ర‌చారం సాగుతుంది. అయితే ఇదంతా కేవ‌లం ప్ర‌చారంగానే క‌నిపిస్తుంది. వీటిపై నేరుగా అనుష్క గానీ..ఆమె కుటుంబ స‌భ్యులు గానీ మీడియా ముందుకు వ‌చ్చింది లేదు. వాటిని ఖండించింది లేదు.

ప్ర‌స్తుతం అనుష్క మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టితో టాలీవుడ్ లో కంబ్యాక్ అయింది. అలాగే మాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా షూటింగ్ కూడా ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఈ నేప‌థ్యంలో భాగ‌మ‌తి-2 లో న‌టించ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు వినిపిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న 'విశ్వంభ‌ర‌'లోనూ అనుష్క‌ని తీసుకుంటున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది.