Begin typing your search above and press return to search.

అనుష్క డ్రీమ్ హీరో సెట్ అవుతున్నాడా?

కానీ త‌న డ్రీమ్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో మాత్రం ఇంత‌వ‌ర‌కూ అవ‌కాశం రాలేదు. న‌టిగా అనేళ్ల పాటు ఇండ‌స్ట్రీలో ఉన్నా? ఎందుక‌నో ఆ కాంబినేష‌న్ సెట్ అవ్వ‌లేదు.

By:  Tupaki Desk   |   6 April 2024 12:30 AM GMT
అనుష్క డ్రీమ్ హీరో సెట్ అవుతున్నాడా?
X

స్వీట్ అనుష్క టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలంద‌రితో ప‌నిచేసింది. చిరంజీవి..నాగార్జున‌..వెంకేట‌ష్‌...మ‌హేష్ ఇలా స్టార్స్ అంద‌రితోనూ ప‌నిచేసింది. కానీ త‌న డ్రీమ్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో మాత్రం ఇంత‌వ‌ర‌కూ అవ‌కాశం రాలేదు. న‌టిగా అనేళ్ల పాటు ఇండ‌స్ట్రీలో ఉన్నా? ఎందుక‌నో ఆ కాంబినేష‌న్ సెట్ అవ్వ‌లేదు. ఈ విష‌యాన్ని అనుష్క ఓపెన్ గానే ఒప్పుకుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో న‌టించే ఛాన్స్ రాలేదని....ఆ ఛాన్స్ ఆల‌స్య‌మ‌య్యే స‌రికి మ‌రింత ఎగ్జైట్ మెంట్ పెరిగిపోతుంద‌ని.. తెలిసిన వారు ఎవ‌రైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి రిక‌మండ్ చేయ‌మ‌ని కూడా అడిగింది.

ఆ రిక్వెస్ట్ చేసి కొన్ని సంవ‌త్స‌రాలు అవుతుంది. బాహుబ‌లి రిలీజ్ అయిన త‌ర్వాత అలా చెప్పుకొచ్చింది. అయినా ఇంత‌వ‌ర‌కూ ప‌న‌వ్వ‌లేదు. మ‌రి ఇప్పుడా స‌మ‌యం ఆస‌న్న‌మైందా? ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి రిక‌మండ్ చేసే నిర్మాత దొరికాడా? అంటే అవున‌నే వినిపిస్తుంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ -అల్లు అర‌వింద్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమాకి రంగం సిద్ద‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఎన్నిక‌లు అనంత‌రం ఈ ద్వ‌యం క‌లిసి ఓ భారీప్రాజెక్ట్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారుట‌. ఇందులో హీరోయిన్ గా అనుష్క‌ని దించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు లీకులందుతున్నాయి.

స్వ‌యంగా ఛాన్స్ కావాల‌ని అనుష్క‌నే కోరింది కాబ‌ట్టి ఇప్పుడా ఛాన్స్ అర‌వింద్ తీసుకుంటున్నార‌నే వార్త ప్ర‌చారంలోకి వ‌స్తోంది. మ‌రి ఇప్ప‌టికిప్పుడు ఈ కాంబినేష‌న్ ఏ కార‌ణంగా తెర‌పైకి వ‌స్తుంది? అంటే అర‌వింద్ వ‌ద్ద ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొంత మొత్తంలో అడ్వాన్స్ తీసుకున్న‌ట్లు గుస గుస వినిపిస్తుంది. అందుకు ప్ర‌తిగానే ప‌వ‌న్ తో అర‌వింద్ తో సినిమా ఒప్పందం చేసుకున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్ న‌డుస్తోంది. ద‌ర్శ‌కు డిగా త్రివిక్ర‌మ్ పేరు కూడా తెర‌పైకి వ‌స్తుంది.

ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ కూడా హీరోలు దొర‌క‌క ఖాళీగానే ఉన్నాడు. స్టార్ హీరోలంతా మ‌రో ఏడాది పాటు దొరికే అవ‌కాశం లేదు. ఈ నేప‌థ్యంలో గురూజీ పీకే ని ట‌చ్ లోకి తెచ్చిన‌ట్లు....అందుకు అర‌వింద్ రెడీ అయిన‌ట్లు వినిపిస్తుంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల ప్ర‌చారం ప‌నుల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.