Begin typing your search above and press return to search.

చిరు కోసం అనుష్క కష్టమేనా?

అయితే ప్రస్తుతం ఆమె వరుస సినిమాల కారణంగా చిరంజీవి సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవచ్చనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   7 Nov 2023 4:26 AM GMT
చిరు కోసం అనుష్క కష్టమేనా?
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాని నిర్మించబోతోంది. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కబోతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లేదంటే జనవరిలో స్టార్ట్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. అయితే ఈ లోపు హీరోయిన్ ని ఫైనల్ చేయాలని అనుకుంటున్నారు. అనుష్క శెట్టిని ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఖరారు చేయాలని అనుకున్నారు. యూవీ నిర్మాతలతో ఆమెకి మంచి సన్నిహిత సంబంధాలు ఉండటంతో కచ్చితంగా ఒప్పుకుంటుంది అని అందరూ భావించారు.

అయితే ప్రస్తుతం ఆమె వరుస సినిమాల కారణంగా చిరంజీవి సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవచ్చనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. దీంతో పాటుగా తన 50వ సినిమాని కూడా ఇప్పటికే ఒప్పేసుకుంది. అలాగే భాగమతి సీక్వెల్ కూడా ఖరారైంది. ఈ వరుస ప్రాజెక్ట్స్ కారణంగా మేగ్జిమం డేట్స్ ని వాటికే కేటాయించింది.

ఈ కారణంగా మెగాస్టార్ చిరంజీవికి ఆమె కాల్ షీట్స్ అందుబాటులో లేవని టాక్. అనుష్క డేట్స్ సెట్ కాకుంటే నయనతారని తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. అయితే ఆమె రెమ్యునరేషన్ 15 కోట్ల వరకు ఉంది. ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఆమె టాప్ -5 లో ఉంది. హీరోయిన్ మీద అంత రెమ్యునరేషన్ పెట్టడంపై చిత్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారు.

ఒక వేళ వీరిద్దరూ కాకుంటే బాలీవుడ్ నుంచి మెగాస్టార్ కి సరిపోయే హీరోయిన్ ని ఎంపిక చేసే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది. మరి ఫైనల్ గా ఎవరు ఖరారు అవుతారనేది ఈ నెలాఖరులోపు తెలిసే అవకాశం ఉందని సమాచారం. ఏది ఏమైనా మెగాస్టార్ కి ఇప్పుడు హీరోయిన్స్ ని ఎంపిక చేయడం దర్శక, నిర్మాతలకి పెద్ద టాస్క్ గా మారిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.