Begin typing your search above and press return to search.

అనుష్క మళ్లీ బ్యాక్ స్టెప్..!

లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే సినిమా షూటింగ్ మొదలైనా సరే అనుష్క సెట్స్ కి ఇంకా రాలేదు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 6:30 AM GMT
అనుష్క మళ్లీ బ్యాక్ స్టెప్..!
X

స్వీటీ అనుష్క సినీ కెరీర్ పై ఆమె ఫ్యాన్స్ పెద్ద ఆందోళనే పెట్టుకున్నారు. నిశ్శబ్ధం తర్వాత 3 ఏళ్లు గ్యాప్ ఇచ్చిన అనుష్క లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో అలరించింది. ఈ సినిమాలో అనుష్క ని చూసి ఆమె అభిమానులంతా కూడా ఖుషి అయ్యారు. ఆ సినిమా సక్సెస్ తర్వాత అయినా అనుష్క మళ్లీ వరుస సినిమాలు చేస్తుందని అనుకున్నారు. కానీ అలా చేస్తే ఆమె అనుష్క ఎందుకు అవుతుంది అలా చేయట్లేదు.

అనుష్క మళ్లీ సినిమాల విషయంలో బ్యాక్ స్టెప్ వేస్తుంది. కేవలం తన లుక్ విషయంలో అభిమానులను అసంతృప్తి పరచకనే అనుష్క సినిమాలకు దూరంగా ఉంటుందా అంటే అదొక్కటే కారణమని చెప్పడం కష్టమని చెప్పొచ్చు. అభినామ నటి ఎలా ఉన్నా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు. కానీ అనుష్క సినిమాలు చేయకపోవడానికి మరో రీజన్ ఏదైనా ఉండి ఉండాలి.

లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే సినిమా షూటింగ్ మొదలైనా సరే అనుష్క సెట్స్ కి ఇంకా రాలేదు. దానికి ఇంకా టైం ఉందని తెలుస్తున్నా చివరి నిమిషంలో అనుష్క ఎక్కడ ఆ సినిమా కాదంటుందో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే ఆ సినిమా నిర్మాతలు యువి క్రియేషన్స్ కాబట్టి అనుష్క కాదనే ఛాన్స్ లేదు.

మరోపక్క అనుష్కకు కథలు నచ్చకనే సినిమాలు చేయట్లేదని కొందరు అంటున్నారు. దాదాపు 3, 4 ఏళ్లలో అనుష్క మనసుకి నచ్చిన కథ ఒక్కటి కూడా రాలెదా అని అంటున్నారు. ఏది ఏమైనా సినిమాల విషయంలో అనుష్క వ్యవహరిస్తున్న ఈ తీరు ఆడియన్స్ ని ఆకట్టుకోవట్లేదు. విశ్వంభర చేసి ఆ సినిమా హిట్ పడితే అయినా అనుష్క వరుస సినిమాలు చేస్తుందేమో చూడాలి. విశ్వంభర అనుష్కతో పాటు చెన్నై చిన్నది త్రిష కూడా నటిస్తుందని టాక్. అయితే ఇద్దరిలో ఒకరు మాత్రమే ఉంటారా ఇద్దరు భాగం అవుతారా అన్నది తెలియాల్సి ఉంది.

ఒకవేళ సినిమాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి పర్సనల్ లైఫ్ లో ఏదైనా డెసిషన్ తీసుకుంటా అంటే అది కూడా లేదు. అనుష్క పెళ్లి ఎప్పుడంటూ మీడియా చేసే హడావిడి కూడా తెలిసిందే. అందుకే అమ్మడు మీడియా ముందుకు వచ్చేందుకు కూడా అంత ఆసక్తి చూపించట్లేదని తెలుస్తుంది.