Begin typing your search above and press return to search.

అనుష్క బేబి బంప్.. ఈసారి జూ.విరాట్..!

అనుష్క బేబీ బంప్‌ను రివీల్ చేస్తున్న ఒక‌ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ వీడియోలో త‌న భ‌ర్త‌ విరాట్‌తో కలిసి నడుస్తూ అనుష్క క‌నిపించింది.

By:  Tupaki Desk   |   10 Nov 2023 5:48 AM GMT
అనుష్క బేబి బంప్.. ఈసారి జూ.విరాట్..!
X

అనుష్క శ‌ర్మ‌- విరాట్ కోహ్లీ జంట‌పై ఇటీవ‌ల ర‌క‌ర‌కాల పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ జంట తొంద‌ర్లోనే పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నార‌న్న‌ది అభిమానుల గెస్. ఇంత‌కుముందు ముంబై ఫోటోగ్రాఫ‌ర్లు ఈ విష‌యాన్ని లీక్ చేసారు. అనుష్క త‌న భ‌ర్త కోహ్లీతో క‌లిసి ఓ గైనిక్ క్లినిక్ కి వెళ్ల‌గా అక్క‌డ ఫోటోగ్రాఫ‌ర్లు ఫోటోలు తీయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఇప్పుడు అనుష్క రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుందనేందుకు ఒక వీడియో ఆధారం లభించింది.

అయితే కొంత‌కాలంగా ఈ పుకార్లు ఎలా ఉన్నా కానీ విరుష్క జోడీ నిశ్శబ్దంగా ఉంది. ఇప్పటివరకు అధికారికంగా దేనినీ ధృవీక‌రించ‌లేదు. అయితే బెంగుళూరు నుండి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వారి కుమార్తె వామికా కోహ్లి తర్వాత మరొక బిడ్డను స్వాగతించడానికి దంపతులు సిద్ధంగా ఉన్నారని ధృవీకరిస్తోంది.

అనుష్క బేబీ బంప్‌ను రివీల్ చేస్తున్న ఒక‌ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ వీడియోలో త‌న భ‌ర్త‌ విరాట్‌తో కలిసి నడుస్తూ అనుష్క క‌నిపించింది. ఆ స‌మ‌యంలో అనుష్క శ‌ర్మ బ్లాక్ క‌ల‌ర్ ఫ్లేర్డ్ దుస్తులను ధరించింది. ముంద‌రి భాగంలో పొట్ట ఉబ్బెత్తుగా క‌నిపిస్తోంది. వీడియోని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే.. శిశువు విష‌యంలో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ క‌నిపించింది అనుష్క‌. తమ హోటల్ లాబీ నుండి బయటికి వెళుతూ అనుష్క - విరాట్ చేయి చేయి పట్టుకుని నడుస్తూ క‌నిపించారు.

ఈ అంద‌మైన‌ జంట డిసెంబర్ 2017లో వివాహం చేసుకున్నారు. జనవరి 2021లో మొదటి బిడ్డ వామిక‌ను స్వాగతించారు. అనుష్క- విరాట్ ఇద్దరూ ప్రైవేట్ వ్యక్తులుగా ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌తారు. మీడియా హ‌డావుడి నుంచి అనుష్క‌ను కొంచెం దూరంగా ఉంచేందుకు, రక్షించడానికి విరాట్ ఇష్టపడతాడు. గత మూడేళ్లలో వారు తమ కుమార్తెతో సోషల్ మీడియాలో ఎప్పుడూ పోజులివ్వకపోవడానికి లేదా కెమెరామెన్లు చిన్నారి వామిక‌ ఫోటోల‌ను తీయ‌డానికి అనుమతించకపోవడానికి ఇదే కారణం.

ప్రస్తుతం జరుగుతున్న ICC ప్రపంచ కప్ టోర్నమెంట్ మ్యాచ్ ల‌కు అనుష్క విరాట్‌తో కలిసి రాలేదు. అనుష్కకు ఇప్ప‌టికి కుదిరింది. నవంబర్ 12 ఆదివారం ప్రత్యేక దీపావళి మ్యాచ్ కోసం బెంగళూరులో ల్యాండ్ అయినప్పుడు తన భర్తతో కలిసి ఉన్నప్పటి అరుదైన సంద‌ర్భ‌మిది. త్వరలో బేబీ నంబర్ 2 కుటుంబంలో చేరనుండంతో విరుష్క అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ జంట త్వరలో సంతోషకరమైన వార్తను ప్రకటిస్తారని ఎదురు చూస్తున్నారు. అభిమానులు వారికి అడ్వాన్స్ డ్ గానే శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. కొంద‌రు ఔత్సాహిక అభిమానులు ఈసారి జూనియ‌ర్ విరాట్ ఆ ఇంట అడుగుపెడుతున్నాడ‌ని కామెంట్లు చేస్తున్నారు.