Begin typing your search above and press return to search.

అనుష్క- క్రిష్.. టైటిల్ ఇదేనా?

క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

By:  Tupaki Desk   |   16 Feb 2024 8:27 AM GMT
అనుష్క- క్రిష్.. టైటిల్ ఇదేనా?
X

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలిలో దేవసేనగా అదరగొట్టిన స్టార్ హీరోయిన్ అనుష్క.. ఆ సినిమా తర్వాత స్పీడు తగ్గించింది. ఆచి, తూచి తన చుట్టూ తిరిగే కథలకే ప్రయారిటీ ఇస్తూ సైన్ చేస్తోంది. ఏడాదికి స్వీటీ నటించిన ఒక్క సినిమా రాట్లేదని చెప్పొచ్చు. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంతో అలరించిన అనుష్క... కొన్ని నెలల గ్యాప్ తర్వాత తిరిగి మరో తెలుగు చిత్రానికి ఓకే చేసింది.

క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ఆల్రెడీ మొదలైనట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆంధ్రా- ఒడిశా బోర్డర్ లో ఈ మూవీ షూటింగ్ జరిగిందని అంటున్నారు. తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ సాధారణ అమ్మాయిగా అనుష్క కనిపించనుందట. ప్రస్తుతం హైదరాబాద్‌ ‌‌‌‌‌‌‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌‌‌‌‌ ‌‌‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందట. అనుష్కపై కీలక సన్నివేశాలు తీస్తున్నట్టు సమాచారం.

వేదం తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌ లో తెరకెక్కుతున్న ఈ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ కు శీలావతి అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. అన్ని సౌత్ లాంగ్వేజేస్ లోనూ 2024లోనే ఈ సినిమా రిలీజ్ కానుందట. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అయితే ఈ ప్రాజెక్ట్ పై మేకర్స్.. అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా.. అనుష్క షూటింగ్ పిక్స్, వీడియోలు ఇటీవలే వైరల్ అయ్యాయి.

ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోనే జరగడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. ఈ సినిమా కథ పదేళ్లకు ముందు జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మహిళా లోకం మొత్తం ఆలోచింపజేసేలా ఈ చిత్రాన్ని తీస్తున్నారట క్రిష్‌. మరి ఈ చిత్రంతో కెరీర్‌ పరంగా అనుష్క, క్రిష్ సక్సెస్‌ బాట పడతారో లేదో చూడాలి.