Begin typing your search above and press return to search.

అనుష్క‌ ఆ హీరోతో ఎఫైర్ నిజమా?

తాజాగా అనుష్క పాత వీడియో రెడ్డిట్‌లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో అనుష్క తాను రణవీర్ సింగ్‌తో ఎందుకు డేటింగ్ చేయకూడదని అనుకుందో 'సిమి గరేవాల్‌'తో చెబుతోంది.

By:  Tupaki Desk   |   29 Oct 2023 2:45 AM GMT
అనుష్క‌ ఆ హీరోతో ఎఫైర్ నిజమా?
X

పాపుల‌ర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' ఎనిమిదవ సీజన్‌ అక్టోబర్ 26 నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. దీపికా పదుకొణె- రణవీర్ సింగ్ కాఫీ విత్ కరణ్ 8కి మొదటి అతిథులుగా వచ్చారు. ఈ కార్యక్రమంలో స్టార్ క‌పుల్ తమ బంధం గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. వారు తమ వివాహానికి ముందు ఆ త‌ర్వాతి సంగ‌తుల‌పై ముచ్చ‌టించారు. సుదీర్ఘకాలం ప్ర‌ముఖ హీరోయిన్ తో రిలేషన్ షిప్ నుంచి విడిపోయిన తర్వాత దీపికను కలిశానని రణవీర్ షోలో బ‌హిరంగంగా చెప్పాడు. ఆ సమయంలో రణవీర్ అనుష్క శర్మతో డేటింగ్ చేస్తున్నాడని నెటిజన్లు వెంట‌నే క‌నిపెట్టేసారు.

తాజాగా అనుష్క పాత వీడియో రెడ్డిట్‌లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో అనుష్క తాను రణవీర్ సింగ్‌తో ఎందుకు డేటింగ్ చేయకూడదని అనుకుందో 'సిమి గరేవాల్‌'తో చెబుతోంది. మొదట అత‌డితో డేటింగ్ చేయడాన్ని ఖండించింది. ఆపై సిమి వారు ఎందుకు కలిసి ఉండలేదని అడిగారు. అనుష్క మాట్లాడుతూ ''ప్రజల‌కు మా గురించి బాగా తెలుసు. ముఖ్యంగా మేము చాలా భిన్నమైన వ్యక్తులమని వారు గ్రహించారు'' అని అన్నారు.

అనుష్క మాట్లాడుతూ, ''మా మధ్య చాలా అస్థిర సంబంధం ఉంది. అవును.. మేం ఒకరినొకరు చంపుకోవచ్చు. నేను సీరియస్‌గా ఉన్నాను. నేను అతడి తల తీసేయగలను. అతడు కూడా తీయగలడు… మేమిరువురం ఎప్పుడైనా సంబంధంలో ఉండవలసి వస్తే, ఆ సంబంధం నుండి రెండు విభిన్నమైన విషయాలను కోరుకుంటున్నాము. మేం జీవితాన్ని చాలా భిన్నమైన రీతిలో చూస్తాం. అతడు చాలా ఆచరణాత్మక (ప్రాక్టిక‌ల్) వ్యక్తి. నేను పూర్తిగా ఆచరణీయం కాదు.

''నేను అతడిని ఇష్టపడ‌తాను.. అతడు ఆకర్షణీయంగా ఉన్నాడు. కానీ నాకు రిలేష‌న్ షిప్ అనేది పనికిమాలినది కాకూడ‌దు. నా కోసం నేను ఉండాలి. నేను మరొక వ్యక్తితో కలిసి ఉంటే, అతను నన్ను శాంతింపజేయాలి. లేకపోతే అది మంచి సంబంధం కాదు'' అని కూడా అనుష్క శ‌ర్మ అన్నారు.

అనుష్క శర్మ కెరీర్ స్పీడ్ మీద ఉండ‌గానే ర‌ణ్ వీర్ తో డేటింగ్ చేసింద‌ని చాలా పుకార్లు షికార్ చేసాయి. కానీ దానిని స‌ద‌రు న‌టీమ‌ణి ఖండించింది. చాలా కాలం పాటు క్రికెటర్ విరాట్ కోహ్లీతో డేటింగులో ఉంది. అనంత‌రం 11 డిసెంబర్ 2017న ఇటలీలో అందమైన పాస్టెల్ నేపథ్య వేడుకలో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు వామిక అనే కుమార్తె ఉంది. అనుష్క ప్రస్తుతం రెండవ బిడ్డతో గర్భవతి అని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే త‌న‌ గర్భం గురించి ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.