అనుష్కపై క్రేజీ రూమర్స్
అనుష్కశెట్టి.. తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. `అరుంధతి` మూవీతో బాక్సాఫీస్ వద్ద హీరోయిన్‌గా తన సత్తా ఏంటో నిరూపించి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేసింది.
By: Tupaki Desk | 26 April 2025 10:00 PM ISTఅనుష్కశెట్టి.. తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. `అరుంధతి` మూవీతో బాక్సాఫీస్ వద్ద హీరోయిన్‌గా తన సత్తా ఏంటో నిరూపించి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేసింది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరో రేంజ్ వసూళ్లని రాబట్టి అనుష్కని స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టింది. ఇక ఈ మూవీ తరువాత అనుష్క నటించిన `బాహుబలి` అందులో తను చేసిన దేవసేన క్యారెక్టర్ ఏ స్థాయిలో ఆమెకు పాపులారిటీని తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ మూవీ తరువాత అనుష్కకు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వచ్చాయి. కానీ తను ఏ సినిమాని అంగీకరించలేదు. `నిశ్శబ్దం` తరువాత కొంత విరామం తీసుకున్న అనుష్క ఆ తరువాత నవీన్ పొలిశెట్టితో `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` మూవీఆతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. యువీ వారు నిర్మించిన ఈ సినిమా ఫరవాలేదు అనిపించింది. దీని తరువాత మళ్లీ గ్యాప్ తీసుకున్న అనుష్క త్వరలో క్రిష్ జగర్లమూడి తెరకెక్కిస్తున్న `ఘాటీ`తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ స్థాయిలో క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈమూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మూవీ తరువాత మలయాళంలో రెజిన్ థామస్ రూపొందిస్తున్న `కథనార్ - ద వైల్డ్ సోర్సెరర్`లో నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని శ్రీగోకులం మూవీస్ నిర్మిస్తోంది. ప్రభుదేవా, వినీత్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో హీరోగా జయసూర్య నటిస్తున్నాడు. ఈ మూవీ తప్ప అనుష్క మరో సినిమా అంగీకరించలేదు. కానీ ఆమె ఏడు ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఓ వింత ప్రచారం తాజాగా జరుగుతోంది.
`సైజ్ జీరో` కారణంగా బరువు పెరిగిన అనుష్క ఆ తరువాత నుంచి బరువుకు సంబంధించిన సమస్యల్ని ఎదుర్కొంటోంది. ఆ మధ్య ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లోనూ అనుష్క బొద్దుగా కనిపించడంతో అంతా అవాక్కయిన విషయం తెలిసిందే. శారిక సమస్యలతో బాధపడుతున్న అనుష్క ఆ కారణంగానే సినిమాలు అంగీకరించడం లేదని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కానీ కొంత మంది మాత్రం అనుష్క ఏడు ప్రాజెక్ట్‌లు అంగీకరించిందని ప్రచారం చేస్తూ కామెడీ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్‌గా మారింది..
