కార్తి కోసం రంగంలోకి జేజమ్మని దించేస్తున్నారా?
`బాహుబలి` సిరీస్ తరువాత జేజమ్మ అనుష్క సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.
By: Tupaki Desk | 13 Jun 2025 9:30 AM IST'బాహుబలి' సిరీస్ తరువాత జేజమ్మ అనుష్క సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. స్టోరీతో పాటు క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే ఎంచుకుంటూ వస్తోంది. ఎంత పెద్ద నిర్మాణ సంస్థ భారీ పారితోషికం ఆఫర్ చేసినా చివరికి బాలీవుడ్ వర్గాల నుంచి బిగ్ డీల్ ఆఫర్లు వస్తున్నా వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ తనకు నచ్చిన సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది స్వీటీ. ప్రస్తుతం అనుష్క నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా `ఘాటి`. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది.
గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో అనుష్క క్యారెక్టర్ పవర్ ఫుల్‌గా సాగనుంది. అనుష్కతో పాటు ఈ మూవీలోని ఇతర పాత్రల్లో విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, చైతన్యరావు, జగపతిబాబు నటించారు. ఈ మూవీని జూలై 11న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నారు. దీనితో పాటు అనుష్క మలయాళంలో `కథనార్ - దివైల్డ్ సోర్సెరర్`లో నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల తరువాత అనుష్క ఏ ప్రాజెక్ట్ చేయబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే స్వీటీకి సంబంధించిన ఆసక్తికరమై వార్త ఒకటి తాజాగా బయటికి వచ్చింది. త్వరలో అనుష్క క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం కానుందని తెలుస్తోంది. త్వరలో లోకేష్ కనగరాజ్ `ఖైదీ` సీక్వెల్‌ని ప్రారంభించబోతున్నాడు. కార్తీ హీరోగా నటిస్తున్న ఈమూవీలోని ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో అనుష్క నటించనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే అనుష్కతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు సంబంధించిన చర్చలను పూర్తి చేసినట్టుగా ఇన్ సైడ్ టాక్. ఇదే నిజమైతే కార్తితో కలిసి అనుష్క చేసే రెండవ సినిమా ఇదే అవుతుంది. గతంలో కార్తితో కలిసి అనుష్క `అలెక్స్ పాండ్యన్`లో నటించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాలో కలిసి నటించబోతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అనుష్క ఇందులో కార్తికి వైఫ్‌గా కనిపించనుందని, తన కోసం జరిగే వార్‌లో తనని కోల్పోయిన ఢిల్లీ జైలుకు వెళతాడని కోలీవుడ్ వర్గాల కథనం. దీనిపై త్వరలోనే లోకేష్ కనగరాజ్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిసింది.
