Begin typing your search above and press return to search.

అనుష్క నిజంగా గ్రేట్‌ భయ్యా..!

అనుష్క సినిమాల విషయానికి వస్తే మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చాలా గ్యాప్ తీసుకుని బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తోంది.

By:  Tupaki Desk   |   10 July 2025 7:48 PM IST
అనుష్క నిజంగా గ్రేట్‌ భయ్యా..!
X

ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నారు. అయితే వారి గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఉండదు, కానీ కొందరు మాత్రం చాలా స్పెషల్‌గా ఉంటారు, వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారు ఎప్పటికప్పుడు తమ గొప్పతనం నిరూపించుకుంటూ, తమ మీద గౌరవం పెరిగే పనులు చేస్తూ ఉంటారు. వారు ఏం చేసినా చాలా హుందాగా ఉంటుంది, వారు ఏ సినిమాలో నటించినా ప్రశంసలు దక్కించుకుంటూ ఉంటారు. అలాంటి హీరోయిన్స్‌లో అనుష్క శెట్టి ఒకరు అనడంలో సందేహం లేదు. ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టి సుదీర్ఘ కాలం అవుతుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు యోగా గురువు భరత్‌ ఠాకూర్ వద్ద శిష్యురాలిగా చేసింది.

ఆర్టిస్టిక్ యోగా స్థాపకుడు, ఆధునిక యోగాకు ఆధ్యుడిగా భరత్‌ ఠాకూర్‌కి పేరు ఉంది. అలాంటి వ్యక్తి వద్ద అనుష్క శిష్యురాలిగా చాలా కాలం చేసింది. అయితే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనుష్క యోగాకు దూరంగా ఉంటు వచ్చింది. ఫిట్‌ నెస్ కోసం అప్పుడప్పుడు యోగా చేసేదేమో కానీ పూర్తి స్థాయిలో యోగాను మాత్రం పట్టించుకోలేదు. యోగాకు దూరం అయినా తన యోగా గురువు భరత్‌ ఠాకూర్‌కి మాత్రం ఆమె దూరం కాలేదు. తన గురువు పై ఎప్పటికప్పుడు గౌరవంను చూపిస్తూ వచ్చింది. తన గురువు పట్ల ఇప్పటికీ ఆమె గౌరవం చూపించడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా గురు పౌర్ణమి సందర్భంగా మరోసారి తన గురు భక్తిని అనుష్క కనబర్చింది.

సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనుష్క తన గురువు భరత్‌ ఠాకూర్‌ను గుర్తు చేసుకుంది. దండం పెట్టే ఈమోజీలను షేర్ చేయడంతో తనకు జీవితంలో ఎన్నో నేర్పిన గురువు అంటూ భరత్‌ ఠాకూర్‌ను గురించి చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తన ఫ్యామిలీ మెంబర్స్‌ తనకు మద్దతుగా నిలవడం గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది. తనకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలిచే భరత్‌ ఠాకూర్‌ అంటే తనకు ఎప్పటికీ గౌరవం అంటూ ఈ పోస్ట్‌ ద్వారా అనుష్క మరో సారి చెప్పకనే చెప్పింది. ముందు ముందు కూడా ఆయనపై గౌరవ మర్యాదలు కొనసాగుతాయని ఆమె చెప్పుకొచ్చింది. భరత్‌ ఠాకూర్‌ తెలుగు ప్రేక్షకులకు భూమిక భర్తగా సుపరిచితుడు.

అనుష్క సినిమాల విషయానికి వస్తే మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చాలా గ్యాప్ తీసుకుని బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తోంది. అందులో క్రిష్ దర్శకత్వంలో చేసిన ఘాటీ సినిమా విడుదలకు సిద్ధం అయింది. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనుష్క బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అనుష్క మాత్రం సినిమాలను ఎక్కువ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆమె కోరినంత పారితోషికం ఇచ్చి లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను చేసేందుకు నిర్మాతలు, దర్శకులు రెడీగా ఉన్నారు. కానీ అనుష్క మాత్రం రెగ్యులర్‌ సినిమాలు చేయకుండా ప్రత్యేకమైన సినిమాలు మాత్రమే చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఘాటీ సినిమాపై ఆమె ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి.