ఘాటీ స్పీడు పెంచాల్సిందే!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క నుంచి మరో సినిమా రిలీజవలేదు. చాలా కాలం తర్వాత అనుష్క ఇప్పుడు ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
By: Tupaki Desk | 18 Jun 2025 12:20 PM ISTటాలీవుడ్ లో తిరుగులేని స్టార్‌డమ్ ను సొంతం చేసుకుంది స్వీటీ అనుష్క. బాహుబలి తర్వాత ఆ క్రేజ్ తారా స్థాయికి చేరినప్పటికీ అనుష్క చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. అలాంటి అనుష్క నుంచి సినిమా వచ్చి చాలా రోజులైంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క నుంచి మరో సినిమా రిలీజవలేదు. చాలా కాలం తర్వాత అనుష్క ఇప్పుడు ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా జులై 11న రిలీజ్ కాబోతుంది. అంటే రిలీజ్ కు పట్టుమని మూడు వారాలు కూడా లేదు. అయినప్పటికీ ఘాటీ టీమ్ ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలుపెట్టలేదు. పక్క సినిమాల నుంచి వరుస అప్డేట్స్, ప్రమోషన్స్ జరుగుతుండటంతో టీమ్ ఇంకా ఘాటీ ప్రమోషన్స్ ను మొదలుపెట్టలేదని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం జూన్ 21 నుంచి ఘాటీ ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ రోజు సినిమా నుంచి ఓ సాంగ్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. రిలీజ్ కు రెండు వారాల ముందు ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమాపై హైప్ ను పెంచి అప్పట్నుంచి నెక్ట్స్ లెవెల్ ప్రమోషన్స్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
అనుష్క బరువు పెరిగి లావు అవడం వల్ల గతంలో ప్రమోషన్స్ కు దూరంగా ఉంది కానీ ఈసారి ఘాటీ ప్రమోషన్స్ లో అనుష్క కూడా పాల్గొననుందని అంటున్నారు. సెలెక్టెడ్ మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలివ్వడంతో పాటూ ఓ ప్రమోషనల్ ఈవెంట్ కు కూడా అనుష్క హాజరవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ లోపు డైరెక్టర్ క్రిష్ ఘాటీని ప్రమోట్ చేయనున్నాడు.
అనుష్క వచ్చాక ఇద్దరూ కలిసి ఘాటీ ప్రమోషన్స్ లో పాల్గొంటారట. ఆల్రెడీ ఘాటీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ కు అమ్ముడయ్యాయి కాబట్టి ఇక సినిమా వాయిదా పడే ఛాన్స్ లేదు. కాబట్టి వీలైనంత త్వరగా మేకర్స్ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసి సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లగలిగితే బెటర్. ఈ సినిమాలో అనుష్క గంజాయి స్మగ్లింగ్ చేసే పాత్రలో కనిపించనుంది.
