దటీజ్ అనుష్క అనిపించిందిగా!
స్వీటీ అనుష్క 'బాహుబలి' తరువాత సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. తన ఇమేజ్‌కు తగ్గ సినిమాలని ఎంచుకుంటూ వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ప్రధాన్యత నిస్తూ వస్తోంది.
By: Tupaki Desk | 13 Jun 2025 5:12 PM ISTస్వీటీ అనుష్క 'బాహుబలి' తరువాత సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. తన ఇమేజ్‌కు తగ్గ సినిమాలని ఎంచుకుంటూ వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ప్రధాన్యత నిస్తూ వస్తోంది. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' తరువాత అనుష్క నటించిన లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ 'ఘాటి'. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. జూలై 11న భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకుంది.
సినిమా రిలీజ్‌కు సరిగ్గా నెల రోజులు టైమ్ ఉండటంతో టీమ్ త్వరలో ప్రమోషన్స్‌ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. వరుసగా లిరికల్ ఆడియోలని రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్‌ని ఓ రేంజ్‌లో చేయబోతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో అనుష్క పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనుందని గ్లింప్స్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ దగ్గరపడుతున్ననేపథ్యంలో ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడినట్టుగా తెలుస్తోంది.
గ్లింప్స్ ఆకట్టుకోవడం, అనుష్క మరో సారి శివాలెత్తే క్యారెక్టర్‌లో కనిపించనుండటంతో 'ఘాటి'కి సంబంధించిన నాన్ థియేట్రికల్ బిజినెస్‌కు భారీ క్రేజ్ ఏర్పడింది. క్రిష్ మరోసారి అనుష్కతో కలిసి చేసిన సినిమా కావడంతో ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో రూ.36 కోట్లకు అమ్ముడు పోయినట్టుగా తెలిసింది. లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఈ ప్రైజ్ దక్కడం ఓ రికార్డ్‌గా చెబుతున్నారు. ఈ డీల్‌తో మేకర్స్ పెట్టిన ఇన్వెస్ట్ మెంట్ దాదాపు వచ్చేసిందని, ఇక మిగతా వచ్చేది అదనంగా మారి లాభాలని అందిస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఈ సినిమా మొత్తం బడ్జెట్ రూ.45 కోట్లు. నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా రూ.36 కోట్లని రాబట్టింది. అంటే పెట్టుబడిలో 90 శాతం రికవరీ అయినట్టే. ఇక థియేట్రికల్ బిజినెస్ పూర్తయితే `ఘాటి` రిలీజ్‌కు ముందే లాభాల్లోకి వెళుతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ థియేట్రికల్ బిజినెస్‌ని క్లోజ్ చేయబోతున్నారట. ఈ మూవీలోని కీలక పాత్రల్లో తమిళ నటుడు విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతిబాబు నటించారు. విద్యాసాగర్ సంగీతం అందించగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వై. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. త్వరలో ప్రారంభం కానున్న ప్రమోషన్స్‌లో అనుష్క పాల్గొనబోతోంది.
