అనుష్క ఇదేం కరెక్ట్ కాదమ్మి..!
స్వీటీ అనుష్క ఘాటి సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 2 May 2025 7:00 PM ISTస్వీటీ అనుష్క ఘాటి సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా అసలైతే ఏప్రిల్ సెకండ్ హాఫ్ రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ సినిమా పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఘాటి సినిమా విషయంలో మేకర్స్ నుంచి కూడా ఎలాంటి అప్డేట్స్ రావట్లేదు. నిశ్శబ్ధం తర్వాత నాలుగేళ్లు గ్యాప్ ఇచ్చిన అనుష్క లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో నటించింది.
ఆ సినిమా సక్సెస్ అయినా కూడా అనుష్క మళ్లీ వరుస సినిమాలు చేయట్లేదు. అనుష్క ఎందుకు ఇలా చేస్తుంది అనుకోవడం ఫ్యాన్స్ వంతు అయ్యింది. పోనీ కమిటైన క్రిష్ ఘాటి సినిమాకైనా అడిగిన డేట్స్ ఇస్తుందా అంటే సినిమా ఎప్పుడు పూర్తవుతుందా అన్నట్టుగా ఉందట. అనుష్క ఇంట్రెస్ట్ లేకుండానే సినిమాలు చేస్తుందా అనుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా అదరగొట్టిన అనుష్క కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ వచ్చింది.
అరుంధతి, రుద్రమదేవి లాంటి సినిమాలు చేయాలంటే అనుష్క వల్లే అవుతుందని ప్రూవ్ చేసుకుంది. ఐతే బాహుబలిలో కూడా ఆమె తన అందంతో మెప్పించింది. ఐతే తన లుక్స్ వైజ్ ఇంకా ఇదివరకులా లేదన్న కారణం చేతనే అనుష్క సినిమాలు చేయట్లేదు. ఐతే క్రిష్ సినిమా ఎలాగు చివరి దశకు వచ్చింది కాబట్టి దాన్ని పూర్తి చేసి నెక్స్ట్ ఏం చేయాలి అన్నది చూస్తుందట. ఘాటితో పాటు అనుష్క ఒక మలయాళ సినిమాకు కూడా సైన్ చేసింది. ఆ సినిమా ఎంతవరకు వచ్చిందో కూడా తెలియాల్సి ఉంది.
అనుష్క ఎందుకు ఇలా చేస్తుంది.. ఆమె కెరీర్ గ్యాప్ కి అసలు రీజన్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఘాటి సినిమా టీజర్ తో సర్ ప్రైజ్ చేసిన అనుష్క మళ్లీ తిరిగి ఫాంలోకి వస్తుందని అనుకున్నారు. కానీ సినిమాని లేట్ చేస్తూ ఆడియన్స్ లో ఉన్న ఇంట్రెస్ట్ ని కోల్పోయేలా చేస్తున్నారు. ఘాటి పూర్తైతే కానీ అనుష్క నెక్స్ట్ సినిమాల గురించి అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తెర మీద అనుష్కని మిస్ అవుతున్న ఆమె ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడొచ్చినా ఆమెను ఎంకరేజ్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఘాటి తర్వాత అనుష్క సినిమాలు చేసినా కాస్త స్పీడ్ గా చేస్తే బాగుంటుందని అంటున్నారు.
