'ఘాటీ ' అనుష్క కెరీర్ ని డిసైడ్ చేస్తోందా!
`భాగమతి` తర్వాత స్వీటీ అనుష్కకు సరైన సక్సస్ పడలేదు. అంటే అనుష్క సక్సస్ చూసి ఏడేళ్లు అవుతుంది.
By: Tupaki Desk | 27 Jun 2025 7:00 PM IST`భాగమతి` తర్వాత స్వీటీ అనుష్కకు సరైన సక్సస్ పడలేదు. అంటే అనుష్క సక్సస్ చూసి ఏడేళ్లు అవుతుంది. `భాగమతి` తర్వాత అనుష్క సినిమాలు చేసింది కూడా రెండు..మూడు చిత్రాలే. అందులో ఒకటి `సైరా నరసిహారెడ్డి` లో గెస్ట్ రోల్ లో కనిపించింది. `నిశబ్దం`, `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` మాత్రం ఉమెన్ సెంట్రిక్ చిత్రాలు. కానీ వాటి ద్వారా అనుష్క సాధించింది ఏం లేదు.
అవి రెండు చెప్పుకోవడానికి లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు తప్ప అవి బాక్సాఫీస్ వద్ద రాణించని చిత్రాలు గానే మిగిలిపోయాయి. థియేటర్లోకి ఎంత వైలెంట్ గా వచ్చాయో అంతకు మించి సైలెన్స్ గా వెళ్లిపో యాయి. ఈ మధ్యలో అనుష్క కెరీర్ పై రకరకాల ప్రచారం జరిగింది. సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చే స్తుందని...పెళ్లి చేసుకుని బెంగుళూరులో స్థిరపడిపోతుందని...మళ్లీ యోగా టీచర్ గా బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఉందని ప్రచారంలోకి వచ్చింది.
కానీ వాటన్నింటిని బ్రేక్ చేస్తూ `ఘాటీ`కి కమిట్ అయింది. అలాగే మాలీవుడ్ లో `కత్నార్` అనే మరో చిత్రం లోనూ నటిస్తోంది. `ఘాటీ` మొదలైన నాటి నుంచి ఆ చిత్రం పూర్వవ్వడానికి ఎంత సమయం పట్టిందో తెలి సిందే. ఈ సినిమాపై ఇంత వరకూ ఎలాంటి బజ్ లేదు. రిలీజ్ కు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. జూలైలో `ఘాటీ` రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత అనుష్క పరిస్థితి ఏంటి అంటే? తెలుగులో కొత్త సినిమాలు వేటికి కమిట్ అవ్వలేదు.
అవకాశాలు రాక చేయలేదా? లేక వచ్చినా వద్దనుకుంటుందా? అన్న సందేహం నడుమ అనుష్క డిసైడ్ అయ్యే సమయం ఆసన్నమైంది అన్న మరో వార్త తెరపైకి వస్తోంది. ఘాటీ రిలీజ్ తర్వాత తెలుగులో కొనసాగాలా? ఇతర భాషలపై దృష్టి పెట్టాలా? అన్న అంశంపై ఓ నిర్ణయం తీసుకోనుందిట. `కత్నార్` తో అనుష్క మాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోన్న నేపథ్యంలో అక్కడే కొన్నాళ్ల పాటు సీరియస్ గా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
