అనుష్క అజ్ఞానం వీడేది అప్పుడేనా!
'ఘాటీ' మొదలైన దగ్గర నుంచి స్వీటీ అనుష్క బయట ఎక్కడా కనిపించలేదు.
By: Tupaki Desk | 14 July 2025 10:00 PM IST'ఘాటీ' మొదలైన దగ్గర నుంచి స్వీటీ అనుష్క బయట ఎక్కడా కనిపించలేదు. ఆన్ సెట్స్ నుంచి ఎలాంటి ఫోటోలు కూడా బయటకు రాలేదు. షూటింగ్ పూర్తై ...సినిమా రిలీజ్ సిద్దమవుతోన్న అనుష్క పిక్ ఏది వైరల్ అవ్వలేదు. ఇటీవలే `బాహుబలి` రిలీజ్ అయి దశాబ్ధం పూర్తయిన సందర్భంగా టీమ్ అంతా మళ్లీ రీయూనియన్ అయింది. ఆ కార్యక్రమంలోనూ అనుష్క ఎక్కడా కనిపించలేదు. దీంతో అనుష్క ఏమైందంటూ సోషల్ మీడియాలో రకరకాల చర్చలకు దారి తీస్తుంది. అసలు అనుష్క హైదరాబాద్ లో ఉంటుందా? బెంగుళూరులో ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
`ఘాటీ` చిత్రీకరణ పూర్తిచేసుకున్న వెంటనే బెంగుళూరుకు వెళ్లిపోయిందని అక్కడ కూడాఇంటిని దాటి బయటకు రాలేదని కొంత మంది వాదన కాగా మరికొంత మంది అమ్మడు విదేశాల్లో ఉందని అంటు న్నారు. ఇంకొంత మంది హైదరాబాద్ లో నే మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతుందని అభిప్రా యపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం తెరపైకి వస్తోంది. అనుష్క `ఘాటీ` సినిమా కోసం చిత్రీకరణ సమయంలోనే వెయిట్ లాస్ అవ్వాల్సి వచ్చిందిట.
ఆ రకంగా కొన్ని ప్రయత్నాలు చేసిందట. కానీ అమ్మడు వెయిట్ లాస్ అవ్వలేదుట. లుక్ పరంగా అనుష్క డైరెక్టర్ కోరుకున్నట్లు ట్రాన్సఫర్ కాలేకపొయిందిట. దీంతో కొన్ని సన్నివేశాలకు సంబంధించి సీజీలో అనుష్క లుక్ లో ఛేంజెస్ చేస్తున్నారుట. ఈనేపథ్యంలో అనుష్కకు సంబంధించి ఎలాంటి ఫోటోలు కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ముందే అనుష్క ఒరిజినల్ లుక్ బయటకు వస్తే? అది సినిమా లుక్ తో ఏమాత్రం సరిపోలదు.
అటుపై విమర్శలకు గురవ్వాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఆ ఛాన్స్ ఇవ్వకుండా అనుష్క మేకర్స్ సలహా మేరకు అజ్ఞానంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి సినిమా ప్రచారానికైనా హాజరవుతుందా? అంటే హాజర వ్వదనే అంటున్నారు. సినిమాకు సంబంధించి అనుష్క వీడియో బైట్ ఇస్తుందని రిలీజ్ అనంతరమే అనుష్క మీడియా ముందుకొస్తుందంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలి.
