చిరంజీవి-బాలయ్యకి స్వీటిని ఎందుకు సెట్ చేయడం లేదు!
కానీ అది పుల్ లెంగ్త్ రోల్ కాదు. అందులో చిరు-అనుష్క జోడీని చూసి ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు అప్పుడే కోరుకుంటున్నారు.
By: Tupaki Desk | 24 May 2025 7:00 PM ISTచిరంజీవి-బాలయ్య సరసన హీరోయిన్ అంటే రిపీట్ అయ్యే భామ నతయనతార త్రిష మాత్రమే. సీనియర్ హీరోలకు ఆ ఇద్దరు భామలు పర్పెక్ట్ గా సెట్ అవ్వడంతో మరో ఆలోచన లేకుండా తీసుకుంటున్నారు. ఇద్దరు పారితోషికం ఎక్కువ డిమాండ్ చేసినా? కాదనకుండా తీసుకొస్తున్నారు. ఆ కాంబినేషన్ ను తెరపై చాలాసార్లు చూసాం. కానీ చిరంజీవి -బాలయ్యలకు స్వీటీ అనుష్కను ఎందుకు సెట్ చేయడం లేదన్నది? అర్దం కాని ప్రశ్న.
అవును నిజమేగా చిరు-బాలయ్య లకు త్రిష..నయనతార మాత్రమేనా? అనుష్క ఆ ఇద్దరు సీనియర్లకు సరితూగదా? అంటే? దర్శకుల తీరును బట్టి చూస్తుంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. చిరంజీవి `విశ్వం భర` చిత్రంలో త్రిషను తీసుకున్నారు. తాజా సినిమా 157 లో నయనతారను ఎంపిక చేసారు. వీటీలో అనుష్కను తీసుకొవచ్చుగా? అన్న ప్రశ్న రెయిజ్ అవుతుంది. చిరంజీవి సరసన అవకాశం వస్తే అనుష్క నటించనంటాదా? లేక చిరంజీవి నటించనంటాడా? ఇప్పటికే `సైరా నరసింహారెడ్డి` లో స్వీటీ నటించింది.
కానీ అది పుల్ లెంగ్త్ రోల్ కాదు. అందులో చిరు-అనుష్క జోడీని చూసి ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు అప్పుడే కోరుకుంటున్నారు. అనుష్క సైతం అందుకు సిద్దంగానే ఉంది. పవన్ కళ్యాణ్ తో పాటు వాళ్లన్నయ్య చిరంజీవితో సినిమా చేయాలని ఉందని చాలాసందర్భాల్లో చెప్పింది. బాలయ్య సరసన కూడా రీపీటెడ్ భామల్నే తీసుకొస్తున్నారు.
బాలయ్య-అనుష్కలను ఒకే ప్రేమ్ లో చూడాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఇప్పటికే అనుష్క వయసు నాలుగు పదులు దాటింది. సీనియర్ హీరోలకు పర్పెక్ట్ ఛాయిస్. నాగార్జున,వెంకటేష్ అయితే ఇప్పటికే స్వీటీతో చాలా సినిమాలు చేసారు. మిగిలిందల్లా? చిరంజీవి-బాలయ్య మాత్రమే. వాళ్లతో ఒక్క ఛాన్స్ ఇచ్చేయురు.
