Begin typing your search above and press return to search.

పదేళ్లుగా టాప్ లోనే.. రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో..

హీరోయిన్ అనుష్కకు ఉన్న క్రేజే వేరు. స్పెషల్ ఫ్యాన్ బేస్ ఆరడుగుల అందగత్తె సొంతం. ఇప్పటికీ టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్స్ వస్తున్నా.. చాలా మంది మాత్రం అనుష్కనే ఫేవరెట్ అని చెబుతుంటారు.

By:  Tupaki Desk   |   23 July 2025 7:15 PM IST
పదేళ్లుగా టాప్ లోనే.. రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో..
X

హీరోయిన్ అనుష్కకు ఉన్న క్రేజే వేరు. స్పెషల్ ఫ్యాన్ బేస్ ఆరడుగుల అందగత్తె సొంతం. ఇప్పటికీ టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్స్ వస్తున్నా.. చాలా మంది మాత్రం అనుష్కనే ఫేవరెట్ అని చెబుతుంటారు. అంతలా గుర్తింపు సంపాదించుకుంది అమ్మడు. సినిమాలు కాస్త తగ్గించినా ఆమె క్రేజ్ మాత్రం అలానే ఉంది.

యోగా టీచర్ అయిన అనుష్క అనుకోకుండానే యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. సాషాగా గ్లామరస్ గా కనిపించి మెప్పించారు. డెబ్యూతోనే అనుష్క మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, చెరో రెండు నంది, రెండు SIIMA అవార్డులు అందుకున్నారు.

సూపర్ మూవీ తర్వాత మహా నందిలో యాక్ట్ చేసినా మెప్పించలేకపోయారు. అనంతరం ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనుష్క క్రేజ్ భారీగా పెరిగిపోయింది. స్టార్ హీరోయిన్ గా అనుష్క మారిపోయారు. ఆ తర్వాత మళ్లీ కొన్ని చిత్రాలతో నిరాశపరిచారు.

అదే సమయంలో తెలుగు డార్క్ ఫాంటసీ చిత్రం అరుంధతిలో ఛాన్స్ అందుకున్న ఆమె.. డ్యూయల్ రోల్ పోషించారు. తన అందం, అభినయంతో తెలుగు సినీ ప్రియులను కంప్లీట్ గా ఫిదా చేశారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో.. లేడీ సూపర్ స్టార్ గా మారిపోయారు.

ఆ తర్వాత వివిధ సినిమాల్లో నటించిన అనుష్క.. బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారని చెప్పాలి. అయితే అరుంధతి మూవీ తర్వాత నుంచి హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా కొనసాగుతోంది అమ్మడు. సుమారు పదేళ్లుగా ఆమెనే టాప్ లో ఉంది. ఇప్పటికే అనుష్కనే కంటిన్యూ అవుతుందట.

గతంలో మూడు కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న అనుష్క ఇప్పుడు ఏకంగా 6 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఘాటీతోపాటు ఓ మాలీవుడ్ మూవీకి కూడా అంతే రేంజ్ లో అందుకుంటున్నారని సమచారం. మొత్తానికి రెమ్యునరేషన్ విషయంలో అనుష్క ఇంకా టాప్ హీరోయిన్ గానే ఉండడం విశేషం.