అనుష్కని మళ్లీ అలా చూడాలని.. ఫ్యాన్స్ కోరిక ఫలిస్తుందా..?
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క రేంజ్ ఏంటన్నది అందరికీ తెలిసిందే. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క అప్పటి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ రేసులో నిలిచింది.
By: Tupaki Desk | 1 Jun 2025 6:16 PM ISTసౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క రేంజ్ ఏంటన్నది అందరికీ తెలిసిందే. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క అప్పటి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ రేసులో నిలిచింది. మిగతా హీరోయిన్స్ లా కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే అన్నట్టు కాకుండా డిఫరెంట్ కథలు ఎంపిక చేసుకుంటూ హీరోయిన్ గా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ఏర్పరచుకుంది అమ్మడు. అనుష్క నటించిన అరుంధతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అప్పటి నుంచి అనుష్క కేవలం కమర్షియల్ సినిమాలనే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ వచ్చింది.
అరుంధతి ఇచ్చిన ప్రోత్సాహంతో అనుష్క అదే వరుసలో రుద్రమదేవి, భాగమతి, నిశ్శబ్ధం ఇలా ప్రత్యేకమైన సినిమాలు చేసింది. వాటిలో మాక్సిమం మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక బాహుబలి ప్రభాస్ కి సరి జోడీగా దేవసేన పాత్రలో అనుష్క తప్ప మరెవరిని ఊహించుకోవడం కష్టం. అలా రాజకుమారి పాత్రలో నటించి మెప్పించింది అనుష్క. ఐతే అనుష్క ఈమధ్య పూర్తిగా సినిమాలకు దూరం అవుతూ వచ్చింది. నిశ్శబ్దం తర్వాత అమ్మడు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది.
ఆ తర్వాత అయినా స్పీడ్ పెంచుతుంది అనుకుంటే మళ్లీ కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ఘాటి సినిమాతో వస్తుంది అనుష్క. ఐతే అనుష్కని మళ్లీ కమర్షియల్ సినిమాల్లో చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. స్టార్ సినిమాల్లో అనుష్క గ్లామర్ రోల్స్ చేస్తే చూసి ఆనందించాలని అనుకుంటున్నారు. ఐతే అది కుదిరే పనిలా కనిపించట్లేదు. అనుష్క సినిమాలనే చేయాలా వద్దా అన్నట్టుగా చేస్తుంది. అలాంటిది ఆమె కమర్షియల్ సినిమాల్లో ఆశించడం తప్పే అవుతుంది.
అనుష్క కూడా పూర్తిగా సినిమాలను వదిలేయలేక అలా అని మళ్లీ ఇదివరకులా వరుస ప్రాజెక్ట్ లు ఓకే చేయలేక కన్ ఫ్యూజన్ లో ఉంది. కెరీర్ కి ఎండ్ కార్డ్ వేయాలని చూసినా సినిమాల మీద ఆమె పెంచుకున్న ప్రేమ మళ్లీ మళ్లీ సినిమాలను చేసేలా చేస్తుందని తెలుస్తుంది. ఘాటితో తిరిగి ఫాంలోకి రావాలని చూస్తున్న అనుష్క గ్లామర్ రోల్స్ చేసినా చేయకపోయినా వరుస సినిమాలు చేస్తే చాలని అనుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. కనీసం ఫ్యాన్స్ కోసమైనా అనుష్క తిరిగి స్టార్ సినిమాలు చేస్తుందా అన్న టాక్ వినిపిస్తుంది. ఐతే అదంతా ఆమె ఓన్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు.
