ఒకే రోజు అనుష్క, రష్మిక? ఎవరిది పైచేయి?
ఇప్పుడు ఘాటీ మూవీలో యాక్ట్ చేస్తున్నారు అనుష్క. అయితే సినిమాల స్పీడ్ తగ్గినా.. స్వీటీకి క్రేజ్ మాత్రం చెక్కుచెదరకుండా ఉంది.
By: Tupaki Desk | 17 July 2025 12:00 PM ISTస్టార్ హీరోయిన్స్ అనుష్క శెట్టి, రష్మిక మందన్నలకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్స్ హిట్స్ సంపాదించుకున్న అనుష్క.. ఇప్పుడు కాస్త స్లో అయ్యారని చెప్పాలి. చివరగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో వచ్చి మంచి హిట్ ను సొంతం చేసుకున్నారు. ఆడియన్స్ ను ఫుల్ గా మెప్పించారు.
ఇప్పుడు ఘాటీ మూవీలో యాక్ట్ చేస్తున్నారు అనుష్క. అయితే సినిమాల స్పీడ్ తగ్గినా.. స్వీటీకి క్రేజ్ మాత్రం చెక్కుచెదరకుండా ఉంది. మరోవైపు.. రష్మిక అయితే వేరే లెవెల్ లో దూసుకుపోతున్నారు. వరుసగా భారీ సినిమాల్లో నటిస్తున్నారు. అంతే కాదు బాక్సాఫీస్ వద్ద అన్నీ వేల కోట్ల హిట్స్ ను సొంతం చేసుకుంటున్నారు.
తన క్రేజ్ రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ వంటి లేడీ ఓరియంటెడ్ మూవీ సహా పలు భారీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అనుష్క, రష్మిక ఒకే రోజు తమ సినిమాలతో సందడి చేయనున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ 5న ఘాటీ, గర్ల్ ఫ్రెండ్ సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయని టాక్ వినిపిస్తోంది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ క్రైమ్ డ్రామా ఘాటీపై ఆడియన్స్‌లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ అండ్ అప్డేట్స్ మంచి రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేశాయి. ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది.
ఇప్పుడు కొత్త రిలీజ్ తేదీని సెప్టెంబర్ 5గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా అదే విడుదల తేదీపై దృష్టి సారించింది. కెరీర్ లో ఫస్ట్ టైమ్ రష్మిక నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా అదే. దీంతో సినీ ప్రియులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతానికి బజ్ అంతగా లేకపోయినా రష్మిక మూవీ కాబట్టి ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. అలా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద అనుష్క, రష్మిక పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఘాటీ స్టోరీ లైన్ ఇప్పటికే తెలిసినా.. ఇంకా ది గర్ల్ ఫ్రెండ్ కు సంబంధించిన అప్డేట్స్ లేవ్. దీంతో ఏ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి. ముఖ్యంగా కంటెంట్ పైనే రిజల్ట్ ఆధారపడుతుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
