స్వీటీ అనుష్కతో సుందర్ కూడా దిగుతున్నాడా?
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ రెండు భాషల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారుట. అవ్నీసినిమాస్- బెంజ్ మీడియా సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 17 May 2025 5:00 AM ISTస్వీటీ అనుష్క సెకెండ్ ఇన్నింగ్స్ స్పీడప్ చేస్తోందా? `ఘాటీ` రిలీజ్ కు ముందే మరో చిత్రాన్ని పట్టాలె క్కించే పనిలో ఉందా? అంటే అవుననే లీకులందుతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరక్కుతోన్న `ఘాటీ` ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగు తున్నాయి. రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సీజీ వర్క్ కారణంగా డిలే చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈసినిమాతో సంబంధం లేకుండా అనుష్క మరో చిత్రం లాక్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. కోలీవుడ్ డైరెక్టర్ సుందర్. సి చెప్పిన స్టోరీకి అనుష్క ఒకే చెప్పిందిట. ఇది హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ అని సమాచారం. సుందర్ అంటే ఇలాంటి చిత్రాలకు పెట్టింది పేరు అని చెప్పాల్సిన పనిలేదు. ఈ జానర్ చిత్రాల్లో అతడికి మంచి సక్సస్ రేట్ ఉంది. ఈ నేపథ్యంలో అనుష్క సుందర్ స్టోరీని ఒకే చేసినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ రెండు భాషల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారుట. అవ్నీసినిమాస్- బెంజ్ మీడియా సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. అవ్నీ సినిమాస్ అన్నది సుందర్ సొంత నిర్మాణ సంస్థ. సినిమా పంపిణీ సంస్థ కూడా. హారర్ జానర్ చిత్రాలు ఇదే సంస్థలో నిర్మించి మంచి హిట్లు అందుకున్నాడు. ఈనేపథ్యంలో మరోసారి కలిసొచ్చిన సొంత నిర్మాణంతో రంగంలోకి దిగుతున్నాడు.
తెలుగులో ఇదే సుందర్ కి తొలి సినిమా అవుతుంది. ఇప్పటి వరకూ ఆయన తెలుగు సినిమాలు డైరెక్ట్ చేయలేదు. అనుష్కకు తెలుగు మార్కెట్ కీలకం కాబట్టి రెండు భాషల్లోనూ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే పలువురు తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సుందర్-అనుష్క ప్రాజెక్ట్ కి సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
