Begin typing your search above and press return to search.

విరాట్ పై అనుష్క అలిగిందా?

అనుష్క‌శ‌ర్మ‌-విరాట్ కొహ్లీ జంట గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆద‌ర్శ దంప‌తులుగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది.

By:  Tupaki Desk   |   8 May 2025 6:36 PM IST
విరాట్ పై అనుష్క అలిగిందా?
X

అనుష్క‌శ‌ర్మ‌-విరాట్ కొహ్లీ జంట గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆద‌ర్శ దంప‌తులుగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. విరాట్ అంటే అనుష్క ఎంత‌గా ప్రేమిస్తుంద‌న్న‌ది విరాట్ కి మాత్ర‌మే కాదు. ప్ర‌పంచం మొత్తం తెలుసు. విరాట్ ని విడిచి ఉండ‌లేదు. అత‌డు ఎక్క‌డ మ్యాచ్ లు ఆడితే అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. సిక్సులు..బౌండ‌రీలు బాదుతుంటే ముద్దుల వ‌ర్షం కురిపిస్తుంది. ప్రతిగా విరాట్ కూడా ప్లైయింగ్ కిస్సు లిచ్చి అంతే ప్రేమ కురిపిస్తాడు.

ఇక ప్ర‌యివేట్ స్పేస్ లో క‌నిపించినా అనుష్క ఎప్పుడు విరాట్ చేయి విడ‌వ‌దు. నిరంత‌రం అత‌డిని అంటిపెట్టుకునే ఉంటుంది. అయితే తాజా వీడియోలో ఆ ప్రేమ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. విరాట్ ను చూసి అనుష్క ఎడ‌ముఖం పెట్టిన‌ట్లే క‌నిపిస్తుంది. వివ‌రాల్లోకి వెళ్తే విరాట్ కోహ్లీ- అనుష్క నిన్న బెంగుళూరు లో క‌నిపించారు. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది.

ఓసారి ఆ విడియోల‌కి వెళ్తే అప్పుడే అక్క‌డ‌కి ఓ కారు వ‌చ్చి ఆగింది. బ‌య‌ట విరాట్ వెయిట్ చేస్తున్నాడు. కారులో నుంచి అనుష్క దిగుతుంది. ఆ స‌మ‌యంలో స‌పోర్ట్ గా కారు నుంచి కింద‌కు దిగ‌డానికి చేయి అందించాడు విరాట్. కానీ అనుష్క విరాట్ చేయి ప‌ట్టుకోలేదు. కారు స‌పోర్టుతోనే కింద‌కు దిగింది. ఆ స‌మ‌యంలో విరాట్ ముఖం వైపు చూడ‌లేదు. దిగిన వెంట‌నే సీరియ‌స్ గా రెస్టారెంట్ లోకి వెళ్లిపోయింది.

ఆ స‌మ‌యంలో వెనుక విరాట్ ఉన్నాడు? అన్న సంగ‌తి ఎక్క‌డా ప‌ట్టించుకోలేదు. విరాట్ కూడా వెంట‌నే ఆమె వెంట న‌డుచుకుంటూ లోప‌లికి వెళ్లాడు. దీంతో వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో అర్దం కాలేదంటూ సోష‌ల్ మీడియాలో నెటి జనులు పోస్టులు పెడుతున్నారు. విరాట్ మీద అనుష్క అలిగిందా? అందుకే అలా విరాట్ ని ప‌ట్టించుకోకుండా వెళ్లిపోయిందా? అంటూ పోస్ట‌లు పెడుతున్నారు. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఇలాంటి అల‌క‌లు స‌హ‌జ‌మే క‌దా.