అనుష్క సినిమాకు అదిరిపోయే బిజినెస్..!
యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ ఘాటి సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఆల్రెడీ సేల్ అయినట్టు తెలుస్తుంది.
By: Tupaki Desk | 12 May 2025 11:30 PMస్వీటీ అనుష్క సినిమా అంటే చాలు ఆడియన్స్ లో ఒక ఎగ్జైట్మెంట్ ఏర్పడుతుంది. ఆడియన్స్ లో అనుష్క క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఐతే అనుష్క రెగ్యులర్ గా సినిమాలు చేయకపోవడం ఆమె ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది. నిశ్శబ్ధం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది. ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత అయినా వెంటనే సినిమాలు చేస్తుందేమో అనుకుంటే మళ్లీ గ్యాప్ ఇచ్చింది.
ఐతే క్రిష్ డైరెక్షన్ లో అనుష్క ఘాటి అనే సినిమా వస్తుంది. క్రిష్ రాసుకున్న కథకు అనుష్కనే పర్ఫెక్ట్ అనుకుని ఆమె కాదన్నా సరే ఒప్పించి మరీ చేస్తున్నాడు. ఘాటి సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అనుష్క ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. సినిమాతో మళ్లీ స్వీటీ తిరిగి ఫాంలోకి వస్తుందని ఆశిస్తున్నారు. అనుష్క సినిమా అనగానే బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది.
యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ ఘాటి సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఆల్రెడీ సేల్ అయినట్టు తెలుస్తుంది. సినిమాకు ఒక మంచి ఫ్యాన్సీ డీల్ వచ్చిందని తెలుస్తుంది. ఇదే కాదు హిందీ థియేట్రికల్ రైట్స్ కూడా మంచి ధరకే అమ్ముడయ్యాయట. తెలుగులో ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంటాయి. ముఖ్యంగా అనుష్క చేస్తున్న సినిమా అంటే దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది.
అనుష్క చేసిన అరుంధతి సెన్సేషనల్ హిట్ కాగా రుద్రమదేవి, భాగమతి సినిమాలు కూడా మంచి సక్సెస్ అయ్యాయి. సో వాటి దారిలోనే ఘాటి సినిమా కూడా అనుష్క స్టామినా ప్రూవ్ చేస్తుందని అనుకుంటున్నారు. అనుష్క క్రిష్ ఆల్రెడీ వేదం సినిమా కలిసి చేశారు. ఆ సినిమాలో అనుష్క సర్ ప్రైజ్ రోల్ ఇప్పటికీ ఆమె ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. ఐతే ఘాటిలో మాత్రం ఒక పోరాటం చేసే మహిళ పాత్రలో అనుష్క కనిపించనుంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది తెలియదు కానీ సరైన ప్రమోషన్స్ తో సినిమాను వదిలితే అనుష్క ఫ్యాన్సే ఈ మూవీని సక్సెస్ చేస్తారని చెప్పొచ్చు. అనుష్క సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే బడ్జెట్ ని సగానికి పైగా రిక్వర్ చేసిందని తెలుస్తుంది. ఇక థియేట్రికల్ బిజినెస్ తో నిర్మాతలకు లాభాలే అని చెప్పొచ్చు.