`ఘాటీ`కి ఏమైంది? అంతా మౌనం!
స్వీటీ అనుష్కని వెండి తెరపై చూసి ఏడాదిన్న దాటింది. `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` తర్వాత అమ్మడు మళ్లీ అభిమానుల ముందుకొచ్చింది లేదు.
By: Tupaki Desk | 24 April 2025 9:00 PM ISTస్వీటీ అనుష్కని వెండి తెరపై చూసి ఏడాదిన్న దాటింది. `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` తర్వాత అమ్మడు మళ్లీ అభిమానుల ముందుకొచ్చింది లేదు. క్రిష్ దర్శకత్వంలో ఘాటీ చిత్రాన్ని పట్టాలెక్కించినా ఇంత వరకూ రిలీజ్ కాలేదు. ఇప్పటికే ఆ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిం చారు. కానీ రిలీజ్ కాలేదు. దీంతో ఘాటీ వెనుక ఏం జరుగుతుందో అర్దం కాని పరిస్థితి ఏర్పడింది.
ఈ సినిమా ప్రారంభోత్సవమే సింపుల్ గా జరిగింది. లాంచింగ్ అనంతరం మీడియాలో పెద్దగా హడావుడి కూడా కనిపించలేదు. ఆటుపై రెగ్యులర్ షూటింగ్ మొదలైనా? ఎలాంటి అప్ డేట్స్ కూడా ఇవ్వలేదు. ఎలాగూ చిత్రీకరణ పూర్తయింది. కానీ సినిమాకి సంబంధించిన ఎలాంటి హైప్ కార్యక్రమం జరగలేదు. గ్లింప్స్ గానీ, లిరికల్ సింగిల్స్ గానీ, టీజర్, ట్రైలర్ ఏదీ కూడా రిలీజ్ చేయలేదు.
సినిమా ప్రారంభోత్సవ సమయంలో ఎంత సైలెన్స్ ఉందో ఇప్పటికీ అదే సైలెన్స్ కనిపిస్తుంది. మరి ఈ మౌనం దేనికో ఎక్కడా రివీల్ చేయలేదు. ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేయకపోవడంతోనే ఇప్పట్లో రిలీజ్ కాని చిత్రంగా తేలిపోయింది. తాజా పరిస్థితి చూస్తుంటే? ఈ సినిమా ఇదే ఏడాది రిలీజ్ అవుతుందా? వచ్చే ఏడాది వాయిదా పడుతుందా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సినిమా వాయిదా వేస్తున్నట్లు కూడా మేకర్స్ ఎక్కడా ప్రకటించలేదు. దీంతో సినిమా ఇంకా ల్యాబ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఒడిశా సరిహద్దులో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి సంఘటనల్ని క్రిష్ గొప్ప గా హైలైట్ చేయగలడు. దీంతో సినిమాపై అంచ నాలు బాగానే ఉన్నాయి. కానీ అనివార్య కారణాలతో రిలీజ్ కు నోచుకోవడం లేదు.
